రామ్ చరణ్ కూతురు క్లిన్ కారను చూశారా? ఫస్ట్ టైం లుక్ రివీల్, బీచ్ లో అలా సరదాగా!
రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కార ఫోటోలు మొదటిసారి రివీల్ చేశాడు. విశాఖ బీచ్ లో క్లిన్ కారతో సరదాగా గడిపిన రామ్ చరణ్, ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్-ఉపాసన పెళ్ళైన పదేళ్లకు తల్లిదండ్రులు అయ్యారు. గత ఏడాది జూన్ నెలలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మించింది. క్లిన్ కార అని పేరు పెట్టారు. క్లిన్ కారను రామ్ చరణ్ దంపతులు అత్యంత అపురూపంగా చూసుకుంటున్నారు. క్లిన్ కార గదిని స్పెషల్ గా రూపొందించారు.
క్లిన్ కార కోసం ఒక కేర్ టేకర్ ని ఏర్పాటు చేశారు. ఆమె జీతం నెలకు రూ. 1.5 లక్షలు అని సమాచారం. అలాగే రామ్ చరణ్-ఉపాసన ఎక్కడికి వెళ్లినా క్లిన్ కార తోడుగా ఉండాల్సిందే. ఆమెను వదిలి రామ్ చరణ్ క్షణం ఉండలేరు. ఆల్రెడీ కూతురితో పాటు పలు దేశాల్లో విహరించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
కాగా క్లిన్ కార ఫోటోను మెగా ఫ్యామిలీ ఇంత వరకు రివీల్ చేయలేదు. దీంతో రామ్ చరణ్ వారసురాలు ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సుకత అందరిలో ఉంది. మొదటిసారి క్లిన్ కార ఫోటోలు బయటకు వచ్చాయి. రామ్ చరణ్-ఉపాసన విశాఖ బీచ్ లో కూతురితో సరదాగా గడుపుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో క్లిన్ కార లుక్ రివీల్ అయ్యింది. అయితే పాక్షికంగా మాత్రమే. స్పష్టంగా క్లిన్ కార ముఖం కనిపించడం లేదు. గతంతో పోల్చితే క్లిన్ కార లుక్ కొంత మేర రివీల్ అయ్యింది.
గేమ్ ఛేంజర్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ అక్కడే ఉన్నారు. క్లిన్ కారను తీసుకుని ఉపాసన వైజాగ్ వెళ్ళింది. సాయంత్రం వేళ బీచ్ లో అలా సరదాగా గడిపారు. వైజాగ్ షెడ్యూల్ పూర్తి అయ్యే వరకు రామ్ చరణ్ అక్కడే ఉంటారు. రామ్ చరణ్ ని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.
దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సునీల్, శ్రీకాంత్, అంజలి ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ నెక్స్ట్ దర్శకుడు బుచ్చిబాబు సానతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే..