థియేటర్లు లేని లోటుని `ఓటీటీ` భర్తీ చేసిందా? వినోదాన్ని పంచడంలో సక్సెస్‌ అయ్యాయా?

First Published Dec 22, 2020, 3:21 PM IST

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకి కాలమే ఆగిపోయినంత పనైంది. సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు పుట్టుకొచ్చాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్. ఇందులో పెద్ద సినిమాలు ఒకటి రెండు తప్ప ఎక్కువ విడుదల కాలేదు. చాలా వరకు తక్కవ బడ్జెట్‌ సినిమాలు విడులయ్యాయి. మరి థియేటర్లు లేని లోటుని భరీ చేశాయా? ఎన్ని అలరించాయి. 

కరోనా విజృంభన నేపథ్యంలో మార్చి 22 నుంచి థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు రెండున్నర నెలల వరకు ఒక్క సినిమా కూడా లేదు. ఆడియెన్స్, జనాలు ఇంటికే  పరిమితమయ్యారు. టీవీలో సినిమాలు, సీరియల్స్ చూసి బోర్‌ ఫీలయ్యారు. అప్పటికే ఉన్న అమేజాన్‌ప్రైమ్స్, నెట్‌ఫ్లిక్స్, జీ5 వంటి ఎప్పటి లాగానే వెబ్‌ సిరీస్‌తో కాస్త  వినోదాన్ని అందించాయి. కానీ అది సరిపోవడం లేదు. సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేస్తే..? అనే ఆలోచనలోంచి కొత్త ఓటీటీలు వచ్చాయి. `ఆహా`తోపాటు మరికొన్ని  చిన్నా చితకా పుట్టుకొచ్చాయి. చిన్న సినిమాలు మొదట ధైర్యం చేశాయి. ఒకటి రెండు సినిమాలకు కాస్త పాజిటివ్‌ రియాక్షన్‌ రావడంతో మరిన్ని సినిమాలు ఓటీటీలో  విడుదలకు ముందుకొచ్చాయి. తమ వడ్డీల భారం నుంచి బయటపడేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చి తమ సినిమాలను విడుదల చేశారు.

ఓటీటీలో విడుదలకు ముందుగా ధైర్యం చేసిన సినిమా `అమృతరామమ్‌`. కొత్త తారాగణంతో సురేందర్‌ కొంటాడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జీ5లో విడుదలైంది.  యూత్‌ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు.

ఆ తర్వాత చాలా రోజులకు కీర్తిసురేష్‌ ఓటీటీలో మెరిసింది. ఆమె నటించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌ `పెంగ్విన్‌` అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఈ  సినిమాలో కీర్తి ఓ బిడ్డకి తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఇది రెగ్యులర్‌ థ్రిల్లర్‌గానే ఉండటం, దీంతోపాటు కాస్త బోరింగ్‌గా  ఉండటంతో ఆడియెన్స్ నిరాశపరిచింది. వినోదాన్ని పంచడంలో విఫలమయ్యింది.

మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ `కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా` `ఆహా`లో విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాత్‌, సీరత్‌ కపూర్‌, షాలిని వంటి తెలిసిన ఫేసులున్న సినిమా  కావడం, రానా సమర్పించడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీన్ని చూసేందుకు చాలా మంది ఎగబడ్డారు. అయితే ఇది యావరేజ్‌ రిజల్ట్ ని చవిచూసింది.  విమర్శకుల ప్రశంసలందుకుంది.

నవన్‌ చంద్ర, సలోని లుత్రా నటించిన `భానుమతి రామకృష్ణ` సినిమా `ఆహా`లో విడుదలైంది. ఓటీటీలో లాక్‌డౌన్‌ టైమ్‌లో మెప్పించిన తొలి సినిమా ఇదే అని చెప్పొచ్చు.  మెచ్యూరిటీ కలిగి ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా మేజరంగా మంచి ప్రశంసలందుకుంది. మంచి ఆదరణ పొందింది.

ఓటీటీలో బిగ్‌ హిట్‌ సినిమా ఏదైనా ఉందంటే అప్పటి వరకు సత్యదేవ్‌ నటించిన `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య`. సత్యదేవ్‌ తన విలక్షణ నటనకు, తనలోని నటనని బయటకు  తీసిన చిత్రంగా ఇది నిలిచింది. ప్రతీకారం, చిన్న చిన్న ఎమోషన్స్ తో రూపొందించి ఘన విజయం సాధించింది. దీనికి `కేరాఫ్‌ కంచెరపాలెం` ఫేమ్‌ వెంకటేష్‌ మహా దీనికి  దర్వకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పొచ్చు.

ఇక విగ్రహాల ప్రధానంగా వచ్చిన `జోహార్‌`చిత్రం `ఆహా`లో విడుదలైంది. తేజ మర్ని దీనికి దర్శకత్వం వహించారు. ప్రస్తుత రాజకీయాలపై సెటైరికల్‌గా వచ్చిన ఈ సినిమా  అంతగా మెప్పించలేకపోయింది. హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోయింది.

నాని, సుధీర్‌బాబు నటించిన `వి` చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడం  చర్చనీయాంశంగా మారింది. దీని కోసం ఆడియెన్స్ ఎగబడి చూశారు. కానీ పూర్తి నిరాశనే మిగిల్చింది.

ఆ తర్వాత వచ్చిన అనుష్క `నిశ్శబ్దం` సైతం డిజప్పాయింట్‌ చేసింది. అనుష్క, మాధవన్‌, షాలిని పాండే, అంజలి, శ్రీనివాస్‌ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించగా, హేమంత్‌  మధుకర్‌ రూపొందించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఆడియెన్స్ ని పూర్తిగా నిరాశ పరిచింది.

రాజ్‌తరుణ్‌, మాళవికా నాయర్‌, హేబా పటేల్‌ నటించిన `ఒరేయ్‌ బుజ్జిగా` చిత్రం `ఆహా`లో విడుదలైంది. వరుసగా పరాజయాల్లో ఉన్న రాజ్‌తరుణ్‌కి మరో ఫ్లాప్‌ వరించింది.  దీనికి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు.

తక్కువ బడ్జెట్‌ చిత్రాల్లో డీసెంట్‌గా వచ్చి సినిమా `కలర్‌ఫోటో`. సునీల్‌ కీలక పాత్రలో, కమెడీయన్‌ సుహాన్‌ హీరోగా, చాందినీ చౌదరి హీరోయిన్‌గా సందీప్‌ రాజ్‌ డైరెక్షన్‌లో  వచ్చిన ఈ సినిమా `ఆహా`లో విడుదలై అంతగా మెప్పించలేకపోయింది.

కీర్తిసురేష్‌ మరోసారి నిరాశ పరిచారు. ఆమె `మిస్‌ ఇండియా`తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంది నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. విదేశాలకు మన ఇండియన్‌ టీ గొప్పతనం  ఏంటో చెప్పే ఓ యంగ్‌ లేడీ జర్నీని తెలిపే ఈ సినిమా ఓటీటీలో మెప్పించలేకపోయింది. దీంతో మరోసారి కీర్తి డిజప్పాయింట్‌ చేసింది.

అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన `గతం` సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనికి కిరణ్‌ కొండమడుగుల దర్శకత్వం వహించారు. థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఇటీవల  `ఇఫీ`(ఇంటర్నేషన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా)కి పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంపిక కావడం విశేషం. తెలుగు నుంచి ఈ ఒక్క సినిమానే ఎంపిక కావడం గమనార్హం.

చివరగా విడుదలైన ప్రముఖంగా చెప్పుకునే సినిమా `మిడిల్‌ క్లాస్ మెలొడీస్‌`. విజయ్‌ దేవరకొండ తమ్ముడు, ఆనంద్‌ దేవరకొండ నటించిన చిత్రమిది. వర్ష బొల్లమ్మ  హీరోయిన్‌. వినోద్‌ ఆనంతోజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది.

రీసెంట్‌గా వచ్చిన ఓటీటీ చిత్రం ఎంఎస్‌రాజు `డర్టీ హరి`. అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనని దక్కించుకుంటోంది. భారీ వ్యూస్‌ని పొందిన చిత్రంగా  నిలిచిందని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. వీటితోపాటు `అమరం అఖిలం ప్రేమ`, `మా వింత గాథ వినుమా`, `బొంబాట్‌`, `ఐఐటీ కృష్ణమూర్తి`, `గువ్వా` గోరింక` వంటి  చిత్రాలు వచ్చి నిరాశపరిచాయి.

ఇలా మొత్తంగా ఓ ఇరవై సినిమాలు విడుదలైతే, అందులో కేవలం ఓ మూడు నాలుగు సినిమాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. రెండు సినిమాలు విజయాన్ని సాధించాయి. ఈ లెక్కన థియేటర్లు లేని లోటుని ఓటీటీ కూడా భర్తి చేయలేదనే చెప్పాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?