హన్సికా పెళ్ళి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? యాపిల్ బ్యూటీ ఏమన్నదంటే..?
త్వరలో పెళ్లి చేసుకోబోతుంది యాపిల్ బ్యూటీ హన్సికా. పెళ్లి తరువాత హాన్సికా సినిమాలు చేస్తుందా..? చేసే అవకాశం ఉందా..? ఈ విషయంలో యాపిల్ పిల్ల ఏమన్నదంటే..?
ఫిల్మ్ కెరీర్ లో దూసుకుపోయింది హన్సికా. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి.. హీరోయిన్ గా అదరగొట్టింది. రీసెంట్ గా ఫిల్మ్ కెరీర్ లో 50 సినిమాలు కంప్లీట్ చేసి.. హాఫ్ సెంచరీ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.
అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. అతి త్వరలో హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Hansika Marriage
ఆమె వివాహానికి ముహూర్తం కూడా ఖరారైందట. డిసెంబర్ 4న జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హన్సిక తన ప్రియుడిని పరిచయం చేసింది. చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు సోహైల్ కతురియా తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
ఈఫిల్ టవర్ సాక్షిగా తన ప్రేమను ప్రపోజ్ చేయడంతో హన్సికా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. యడం తన ప్రియుడు అలా ప్రపోజ్ చేయడంతో హన్సిక ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఆనందంలో ఉప్పొంగిపోతుంది. ఈ సందర్భంగా `ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా` అని పేర్కొంది బ్యూటీ.
ఇక ఈ క్రమంలో పెళ్లి తరువాత హన్సికా సినిమాలకు దూరం అవుతుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఎలాగు 50 సినిమాలు పూర్తి అవ్వడంతో ఇక ఇండస్ట్రీకి దూరం అయ్యి.. బిజినెస్ లు చూసుకుంటుందన్న మాట వినిపించింది. ఇక ఈ విషయంలో యాపిల్ బ్యూటీ స్పందించింది.
ఇక ఈ క్రమంలో పెళ్లి తరువాత హన్సికా సినిమాలకు దూరం అవుతుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఎలాగు 50 సినిమాలు పూర్తి అవ్వడంతో ఇక ఇండస్ట్రీకి దూరం అయ్యి.. బిజినెస్ లు చూసుకుంటుందన్న మాట వినిపించింది. ఇక ఈ విషయంలో యాపిల్ బ్యూటీ స్పందించింది.