7 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో అమ్మాయితో సంబంధం.. షణ్ముఖ్ అన్న నిజస్వరూపం బయటపెట్టిన గీతూ రాయల్
బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్, అతడి సోదరుడు సంపత్ గంజాయితో పోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. ఊహించని పరిణామాల మధ్య వీళ్ళిద్దరూ పోలీసులకు చిక్కారు.
బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్, అతడి సోదరుడు సంపత్ గంజాయితో పోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. ఊహించని పరిణామాల మధ్య వీళ్ళిద్దరూ పోలీసులకు చిక్కారు. షణ్ముఖ్ సోదరుడు మౌనిక అనే అమ్మాయిని 7 రోజుల్లో ఫిబ్రవరి 28న పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ అతడు మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు.
తనకి కాబోయే భర్త ఇలా చీటింగ్ చేయడంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో సంపత్ ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ కూడా గంజాయితో దొరికేశాడు. మౌనికకి బిగ్ బాస్ గీతూ రాయల్ క్లోజ్ ఫ్రెండ్. ఈ సంఘటనపై గీతూ రాయల్ తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
గతంలో నేను షణ్ముఖ్ బాగా మాట్లాడుకునే వాళ్ళం. కానీ నేను ఇచ్చిన రివ్యూల వల్ల షణ్ముఖ్ హర్ట్ అయ్యాడు. దీనితో మా ఇద్దరి కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది. కానీ షణ్ముఖ్ అన్న సంపత్ ప్రియురాలు మౌనిక నాకు క్లోజ్ ఫ్రెండ్. సంపత్ మౌనిక చాలా ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. వాళ్లిద్దరూ ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది. కానీ విభేదాలు తలెత్తాయి.
ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు తొలగిపోయాక ఫిబ్రవరిలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 28న వీళ్లిద్దరి పెళ్లి. కానీ సంపత్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. కాబోయే భర్త అలా చేస్తే ఏ అమ్మాయి కూడా భరించలేదు. మౌనిక అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. సంపత్ పైన ఫిర్యాదు చేస్తే షణ్ముఖ్ ఇరుక్కున్నాడు. ఇది ఆమె కావాలని చేసింది కాదు. మౌనిక సాధారణంగా పోలీసుల వరకు వెళ్లే అమ్మాయి కాదు.
సంపత్ మోసం చేయడం వల్లే ఇలా జరిగింది. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం ఏంటి ? పైగా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉన్నట్లు చెప్పడం ఏంటి ? సంపత్ చేసిన పని నాకు కూడా నచ్చలేదు అని గీతూ రాయల్ పేర్కొంది.
గతంలో మౌనిక డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది. సంపత్ చీట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక వేళ ఇష్టం లేకుంటే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాల్సింది. పెళ్లి వరకు వచ్చి ఇలా చేయడం న్యాయం కాదు. ప్రస్తుతం మౌనిక పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అని గీతూ రాయల్ పేర్కొంది.