గంగవ్వ కొత్త ఇల్లు ఖర్చు ఎంతంటే.. బిగ్ బాస్ గంగవ్వకు అన్ని లక్షలు ఇచ్చాడా?
First Published Jan 2, 2021, 2:15 PM IST
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో అందరినీ ఆకట్టుకున్నవారిలో గంగవ్వ ఒకరు. అరవై ఏళ్ల ప్రాయంలో హౌస్ లోకి ప్రవేశించే అవకాశం పొందిన గంగవ్వ ప్రేక్షకుల మద్దతు అందుకున్నారు. తెలంగాణా యాసలో ఇంటి సభ్యులపై గంగవ్వ పంచ్ లు సరదా పంచేవి.

అయితే గంగవ్వ ఆరోగ్య కారణాల చేత హౌస్ నుండి స్వచ్చందం గా బయటికి వచ్చారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఇంటిపై బెంగ అవుతుందని బిగ్ బాస్ కి గంగవ్వ విన్నవించుకోగా... ఆమెకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఇంటికి పంపివేశారు.

హౌస్ లో ఉన్నంత కాలం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు గంగవ్వ. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, టైటిల్ గెలుచుకొని వస్తానని, మీరు ఓట్లు వేయండని గంగవ్వ చెప్పడం జరిగింది. అలాగే గెలిచిన డబ్బులతో ఇల్లు నిర్మించుకోవాలి అనేది తన కోరికగా గంగవ్వ చెప్పారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?