ఏ వయసైనా తోడు కోరుకోవడంలో తప్పేంటీ... రజినీ, చిరంజీవి కూడా అలా చేశారు, కానీ మా పేరెంట్స్!
First Published Jan 3, 2021, 2:09 PM IST
కోలీవుడ్ లో వనితా విజయ్ కుమార్ ఒక సంచలనం. నటులు విజయ్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె అయిన వనితా విజయ్ కుమార్ వివాదాలకు మారుపేరు. లెక్కకు మించిన వివాదాలతో సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ సంపాదించుకున్న వనితా విజయ్ కుమార్ ముచ్చటగా మూడోవాడిని కూడా వదిలేసింది.

గత ఏడాది జులై లో మూడో వివాహంగా నిర్మాత పీటర్ పాల్ ని మనువాడిన వనిత విజయ్ కుమార్ అతనికి కూడా బై చెప్పింది. మూడో పెళ్లి విషయంలో కూడా రాంగ్ ఛాయిస్ చేశానని ఒప్పుకున్న వనితా విజయ్ కుమార్, అతనితో జరిగింది పెళ్లే కాదు అన్నారు. తన వైవాహిక జీవితం విఫలం కావడానికి ఆమె కొన్ని కారణాలు చెప్పుకొచ్చారు. (photo courtesy: Suman tv)

చిన్న వయసులోనే తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారు. అమ్మాయికి 18ఏళ్ళు వస్తే చాలు పెళ్లి చేసేయాలని మా ఫ్యామిలీలో నిబంధన పెట్టుకునేవారు. తక్కువ వయసులో జరిగిన పెళ్లి వలన నేను ఎదుర్కొన్న ఇబ్బందులు మా పేరెంట్స్ అర్థం చేసుకోలేదని వనితా విజయ్ కుమార్ అన్నారు. (photo courtesy: Suman tv)
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?