బయటపడ్డ నిహారిక విడాకుల బాగోతం, అక్కడే తేడా కొట్టిందా! ఓపెన్ గా చెప్పేసింది!
నిహారిక కొణిదెల భర్త వెంకట చైతన్య నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు కారణాలు ఏమిటనేది తెలియదు. మొదటిసారి నిహారిక ఓపెన్ అయ్యారు.
Niharika Konidela
మెగా ఫ్యామిలీలో పుట్టిన రెబల్ గర్ల్ నిహారిక కొణిదెల. ఇలా అనడానికి కారణం... ఆమె ఎందరినో ఎదిరించి హీరోయిన్ అయ్యింది. నిహారిక హీరోయిన్ అవుతానంటే ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోలేదు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కూడా నిరాకరించినట్లు సమాచారం.
నేను హీరోయిన్ కావాల్సిందే అని పట్టుబట్టిన నిహారిక పంతం నెగ్గించుకుంది. ఒక మనసు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. హీరోలుగా ఆ ఫ్యామిలీ అబ్బాయిలను నెత్తిన పెట్టుకునే మెగా ఫ్యాన్స్ నిహారికను ప్రోత్సహించలేదు. మెగా హీరోల మద్దతు కూడా అంతంత మాత్రమే. దాంతో నాలుగైదు సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు.
Niharika Konidela
ఇక 2020లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. గుంటూరుకు చెందిన పోలీస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ కొడుకు వెంకట చైతన్యతో నిహారిక వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది. అనూహ్యంగా రెండేళ్ల తర్వాత విడిపోయారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుండి వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు తొలగించడంతో విడాకుల పుకార్లు చెలరేగాయి.
2023 ప్రారంభంలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. విడిపోవడానికి కారణాలు ఏమిటనేది తెలియదు. అయితే మొదటిసారి దీనిపై నిహారిక పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. నటించకూడదని అత్తింటివారు ఆంక్షలు పెట్టినందుకే గొడవలు మొదలయ్యాయని నిహారిక కామెంట్స్ ని బట్టి అర్థం అవుతుంది.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ... ఇకపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోను, స్లో అండ్ స్టడీగా వెళతాను. ప్రస్తుతం ఒక తమిళ సినిమా చేస్తున్నాను. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాను. నన్ను నేను స్క్రీన్ పై చేసుకుని ఐదేళ్లు అవుతుంది. ఈ గ్యాప్ రావడానికి కారణం పెళ్లి.
Niharika Konidela
వివాహం అనంతరం నేను యాక్టింగ్ మానేయాలని చాలా మంది భావించారు. మా వదిన లావణ్యను కూడా ఇదే ప్రశ్న అడిగారు. అసలు పెళ్ళికి, ప్రొఫెషన్ కి సంబంధం ఏంటీ? పెళ్ళైతే నటించ కూడదా? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. జరిగిందేదో జరిగిపోయింది. నాకు నచ్చినట్లు బ్రతకడమే సంతోషం ఇస్తుంది. ఇకపై రెట్టించిన ఎనర్జీతో ముందుకు వెళతాను... అని అన్నారు.
పెళ్లి కారణంగానే సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యానని నేరుగా చెప్పిన నిహారిక, పెళ్లయ్యాక నటన వదిలేయాలని కొందరు భావించారని చెప్పారు. కాబట్టి నటన విషయంలో అత్తింటి వాళ్ళు పెట్టిన ఆంక్షలు నిహారికకు నచ్చకపోవడమే విడాకులకు కారణం కావచ్చనే వాదన మొదలైంది...