సెట్లో అంతా నగ్నంగా ఉంటే ఓకే.. న్యూడ్ సీన్‌కి హీరో కండిషన్
గతంలో ఓ సినిమా కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను నగ్నంగా నటించాలని కోరాడు చిత్ర దర్శకుడు. అయితే ఆ సీన్లో నటించేందుకు చిత్రయూనిట్‌కు దిమ్మతిరిగే కండిషన్ పెట్టాడు సైఫ్.
ఓంకార చిత్రం షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను న్యూడ్‌గా నటించమని కోరాడు దర్శకుడు.
నటి నేహా దూపియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో, చిత్రయూనిట్ తనను నగ్నంగా నటించాలని కోరారని వెల్లడించాడు సైఫ్ అలీ ఖాన్.
దర్శకుడు విశాల్ భరద్వాజ్ తన బ్యాక్ నుంచి న్యూడ్ సీన్ చిత్రీకరించాలని చెప్పటంతో అందుకు సైఫ్ ఓ కండిషన్ పెట్టాడు.
ఆ సీన్ చిత్రీకరించేందుకు సైఫ్ పెట్టిన కండీషన్ ఏంటి అంటే.. తన పాటు సెట్లో ఉన్న దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఇతర యూనిట్ సభ్యులు కూడా న్యూడ్‌గానే ఉండాలని చెప్పాడట.
సైఫ్ పెట్టిన కండిషన్‌కు దిమ్మతిరిగిపోయిన దర్శకుడు విశాల్, ఆ సీన్ లేకుండానే ఓంకార సినిమాను పూర్తి చేశాడు.
అయితే అప్పట్లో ఆ సీన్‌కు నో చెప్పినందుకు సైఫ్ ఇప్పుడు బాధపుడుతున్నాడు. ఆ సీన్ చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఆ తరువాత జాన్ అబ్రహం తొలిసారిగా తన బ్యాక్ సంగం కనిపించేలా ఓ సీన్లో నటించాడు. అయితే జాన్ ఫిజిక్ అద్భుతంగా ఉంటుంది, కాబట్టి ఫస్ట్ నేక్డ్ సీన్ జాన్ చేయటమే కరెక్ట్ అని చెప్పాడు.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ జంట త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు.