వరుణ్ తేజ్ పెళ్లి.. ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగబాబు..
మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ అయిపోయింది. దీంతో ఇప్పుడందరి ఫోకస్ వరుణ్ తేజ్‌పైనే. నాగబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు ఫ్యాన్స్. దీంతో అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు. అభిమానులకే ఆ బాధ్యత అప్పగించాడు. అంతేకాదు అమ్మాయి ఎవరనేది కూడా వాళ్ల నిర్ణయానికే వదిలేశాడు. నాగబాబు సమాధానం మెగా ఫ్యాన్స్ ని అవాక్కయ్యేలా చేస్తుంది.
కుర్ర హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ అంతా బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఇప్పటికే రానా, నితిన్, నిఖిల్, వంటి వారంతా పెళ్ళిళ్లు చేసుకున్నారు. దీంతో మరో ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వరుణ్ తేజ్‌కి పెళ్లి గోల స్టార్ట్ అయ్యింది.
తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉండే నాగబాబు తాజాగా ఇన్‌స్టాలో ఫ్యాన్స్ తో ఛాటింగ్ నిర్వహించారు. ఇందులో వరుణ్ తేజ్ పెళ్లి ప్రస్తావన వచ్చింది.
అభిమానులు అనేక ప్రశ్నలు నాగబాబుని అడిగారు. ఓపికగా సమాధానం చెబుతూ వచ్చారు. ఇంతలో `వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్` అని అడిగేశాడు. దీనికి మెగా బ్రదర్ స్పందిస్తూ, `మంచి సంబంధాలు ఉంటే చూడండి` అని చెప్పాడు. నాగబాబు ఇచ్చిన ఆఫర్‌కి మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు ఓ నెటిజన్ మరో తుంటరి ప్రశ్న అడిగాడు. `వరుణ్ ఓ మిడిల్ క్లాస్ అమ్మాయితోనే తనజీవితం పంచుకుంటాను. అదే ఫిక్స్ అని అంటే ఏం చేస్తార`ని అడిగారు. అందుకు నాగబాబు స్పందిస్తూ, `మీకు ఓకే అయితే నేనేమంటా` అని చెప్పాడు.
దీంతో వరుణ్ తేజ్ ఎలాంటి అమ్మాయిని ఇష్టపడ్డా తనుకు ఓకే అనే హింట్ ఇచ్చాడు నాగబాబు. అంతేకాదు అమ్మాయిని వెతికే బాధ్యత కూడా అభిమానులకే అప్పగించాడు. దీంతో తనకు మళ్లీ మళ్లీ ఈ ప్రశ్న రాకుండా జాగ్రత్త పడ్డాడు. అదే సమయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్‌ఖుషీ అవుతున్నారు.
వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఆ మధ్య హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మరి వరుణ్ మ్యారేజ్ ఎప్పుడుంటుందో చూడాలి. అంతేకాదు మెగా హీరోల్లో సాయితేజ్ మ్యారేజ్ విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాగబాబు ఇదే ఛాట్‌లో ఎన్టీఆర్‌ని ఈ నేటితరం టార్చ్ బేరర్ అని, మహేష్‌ని, `మా కృష్ణగారి అబ్బాయి` అని, ప్రభాస్‌ని, తెలుగు సినిమా మాస్ అని చెప్పాడు. నాగబాబు ప్రస్తుతం సొంతంగా తన యూట్యూబ్ ఛానెల్లో స్టాండప్ కామెడీ షోస్ చేస్తున్నాడు.
వరుణ్ తేజ్ `గని`,`ఎఫ్3` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.