'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' రివ్యూ!

First Published 31, May 2019, 10:52 AM IST

'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ ఈసారి హీరోగా, డైరెక్టర్ గా 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 

'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ ఈసారి హీరోగా, డైరెక్టర్ గా 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. హైదరాబాద్ పాతబస్తీ నేపధ్యంలో సినిమాను రూపొందించారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. వెంకీ, నాని లాంటి హీరోలు ప్రమోషన్స్ లో పాల్గొనడంతో మరింత హైప్ పెరిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందాం!

కథ : దాస్(విశ్వక్ సేన్) అనే యువకుడు ఫ‌ల‌క్‌నుమాలోనే పుట్టి, అక్కడే చదువుకుంటూ ఉంటాడు. అతడి స్నేహితులు, చదువు అంతా అక్కడే కావడంతో అతడిని  ఫ‌ల‌క్‌నుమా దాస్ అని పిలుస్తుంటారు. చిన్నప్పుడు శంకరన్న అనే రౌడీషీటర్ చేసే పనులకి దాస్ ఆకర్షితుడవుతాడు. తన స్నేహితులతో కలిసి అతడినే ఫాలో అవుతుంటాడు. పెరిగి పెద్దయిన తరువాత గొడవలపైనే ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తుంటాడు. దాస్ అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ కి పాండు(ఉత్తేజ్) అనే వ్యక్తి సపోర్ట్ చేస్తుంటాడు. డబ్బు సంపాదించడం కోసం దాస్ మటన్ షాప్ పెట్టలనుకుంటాడు. దాని కోసం పొట్టేలను హోల్ సేల్ గా అమ్మి వ్యాపారం చేసే రవి, రాజు అనే వారి దగ్గరకి వెళ్తారు. అప్పటికే రవి, రాజు.. రౌడీషీటర్ శంకరన్నని చంపేసి జైలుకి వెళ్లి వస్తారు. అలాంటి వారితో కలిసి పని చేయడం ఇష్టం లేకపోయినా తప్పక వ్యాపారం చేస్తుంటాడు. మెల్లగా దాస్ స్నేహితులే పొట్టేలు దిగుమతి వ్యాపారం కూడా మొదలుపెడతారు. ఈ క్రమంలో ఓ బార్ లో దాస్ అతడి స్నేహితులు రవి బావమరిదితో గొడవ పడతారు. ఈ క్రమంలో దాస్ అనుకోకుండా చేసిన పొరపాటుతో హత్య కేసులో ఇరుక్కుంటాడు. దాని నుండి ఎలా బయటపడతాడు..? తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

ఆటిట్యూడ్ ఉంది కానీ కథే.. : ఈ సినిమా ట్రైలర్ తో రచ్చ చేశాడు విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో మరో 'అర్జున్ రెడ్డి' వస్తుందని అందరూ అనుకున్నారు. విశ్వక్ సేన్ మరో విజయ్ దేవరకొండ అవుతాడని భావించారు. కానీ మొత్తం రివర్స్ అయింది. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఆశించిన ఆడియన్స్ కి పెద్ద షాక్ ఇచ్చాడు ఫ‌ల‌క్‌నుమా దాస్‌. హీరోలో ఆటిట్యూడ్ ఉన్నా.. కథలో సత్తానే లేదు.

సినిమా ఫస్ట్ హాఫ్ తో పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం బాగా విసిగించేశాడు. స్లోగా సాగే సన్నివేశాలు, సీరియల్ లా అనిపించే ఎమోషన్స్ తో ఆడియన్స్ తలలు పట్టుకోవడం ఖాయం. కథ ఎక్కడ మొదలై, ఎటు వెళ్తుందోననే కన్ఫ్యూజన్ కలుగుతుంది. కాలేజీ ఎపిసోడ్స్, లవ్ ట్రాక్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు మినహా సినిమాలో మరేదీ ఆకట్టుకోదు.

నటీనటుల పెర్ఫార్మన్స్.. : విశ్వక్ సేన్ సినిమా మొత్తం తన భుజాలపై నడిపించాడు. ఫ‌ల‌క్‌నుమా దాస్‌ పాత్రలో జీవించేశాడు. లోకల్ మాస్ కుర్రాళ్లు ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. చాలా రోజుల తరువాత ఉత్తేజ్ కి మంచి పాత్ర దక్కింది. తరుణ్ భాస్కర్ తన నటనతో అందరికీ షాక్ ఇచ్చాడు. చిన్న రోల్ చేసినా అతడి పాత్ర గుర్తుండిపోతుంది. హీరోయిన్లకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. మిగిలిన వాళ్లంతా కూడా కొత్త నటులే..

టెక్నికల్ గా.. : ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ వివేక్ సాగర్ అందించిన సంగీతం. ముఖ్యంగా నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను డామినేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నటుడిగా మెప్పించిన విశ్వక్ సేన్ దర్శకుడిగా మెప్పించలేకపోయాడు.

ఓవరాల్ గా.. : సినిమాలో కంటెంట్ లేకపోవడం, బూతులు ఎక్కువగా వినిపించడం వలన మల్టీప్లెక్స్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పలేం.. ఓ వర్గపు ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్ : 2/5

రేటింగ్ : 2/5

loader