Mehreen: ఉష్... ఆ డ్రెస్ ఏంటీ? బెడ్ పై ఆ ఫోజేంటీ?... మెహ్రీన్ బోల్డ్ ఫోటోస్ పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్!
అసలుకే మైమరపించే పాలకోవ లాంటి పరువాలు. ఆపై హాట్ డ్రెస్, దానికి మించిన బోల్డ్ ఫోజ్. ఇక ఎవరికైనా మతి చెలించకుండా ఉంటుందా. పంజాబీ బ్యూటీ మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో చూస్తే నోటా మాటరాదు. ఆమె గ్లామర్ ని ఆస్వాదిస్తూ... అలా ఎవరైనా నిల్చుండి పోవాల్సిందే.
Mehreen Pirzada
హాట్ ట్రెండీ వేర్ ధరించిన మెహ్రీన్ (Mehreen Pirzada) బెడ్ పై పడుకొని కవ్వించే చూపులతో చంపేసింది. మెహ్రీన్ బోల్డ్ అటెంప్ట్ కి ఫ్యాన్స్ క్లీన్ బ్లౌల్డ్ అయ్యారు. దీంతో మనసుకు తోచిన క్రేజీ ఫీలింగ్ కామెంట్ రూపంలో వదులుతున్నారు. మెహ్రీన్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఈ మధ్య ఆమె తరచుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
Mehreen Pirzada
ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే... మెల్లగా ఊపందుకుంటుంది. ఆమెకు కొన్ని క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. తాజాగా ఆమె ఎఫ్3 చిత్రంలో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేసింది. ఓపెనింగ్స్ భారీగా రాబట్టిన ఎఫ్3 కొత్త చిత్రాల విడుదలతో కొంచెం నెమ్మదించింది.
Mehreen Pirzada
పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా అధిక ధరలకు ఎఫ్3 హక్కులు విక్రయించారు. దీంతో ఎఫ్3 నష్టాలు తేవడం ఖాయంగా కనిపిస్తుంది.
అలాగే స్పార్క్ పేరుతో ఓ తెలుగు మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ మొదలైంది. వీటితో పాటు ఓ కన్నడ చిత్రం చేస్తున్నారు. ఇది ఆమెకు కన్నడ డెబ్యూ కావడం విశేషం.
Mehreen
ఇక మెహ్రీన్ గత ఏడాది భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. భవ్య బిష్ణోతో రిలేషన్ లో ఉన్నప్పుడు మెహ్రీన్ ఎటువంటి చిత్రాలు ఒప్పుకోలేదు. కెరీర్ ఏమంత జోరుగా లేని తరుణంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని భావించారు.
మరలా ఫార్మ్ లోకి వచ్చిన మెహ్రీన్ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. అదే క్రమంలో ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో మెహ్రీన్ గ్లామరస్ ఫొటో షూట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. కెరీర్ కోసం సన్నబడిన మెహ్రీన్ నాన్ స్టాప్ గ్లామర్ షోతో అలరిస్తున్నారు.