వెస్ట్రన్ వేర్ లో ఐశ్వర్య రాజేశ్ పరువాల విందు.. డస్కీ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా..
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) సోషల్ మీడియాలో గ్లామర్ వెలుగులు పూయిస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఐశ్వర్య స్టన్నింగ్ స్టిల్స్ మతిపోగొడుతున్నాయి. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
డస్కీ బ్యూటీ, తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ వరుస సినిమాలతో ప్రేక్షకులనను అలరిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్ల నటిస్తూ ప్రస్తుతం బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది.
ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. విభిన కథాంశాలను ఎంచుకుంటున్న రొటీన్ కు భిన్నమైన పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో అరడజను చిత్రాల్లో నటిస్తోందీ బ్యూటీ.
ఐశ్వర్య తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలానే దగ్గర. చైల్డ్ ఆర్టిస్ట్ గా తను నటించిన తొలి తెలుగుచిత్రం ‘రాంబంటు’. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘కౌసల్య క్రిష్ణమూర్తి’ చిత్రంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ది గ్రేట్ విమెన్ క్రికెటర్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్’ చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. చివరిగా తెలుగులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ‘రిపబ్లిక్’ చిత్రంలో నటించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులను పలకరిస్తూనే ఉంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో ఐశ్వర్యా రాజేశ్ అదరగొడుతోంది. గతకొద్ది రోజులుగా ఐశ్వర్య ట్రెడిషనల్ లుక్ తోపాటు.. వెస్ట్రన్ లుక్ లోనూ మతిపోగొడుతోంది.
లేటెస్ట్ గా తను నిర్వహించిన ఓ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఐశ్వర్యా ఇండో వెస్ట్రన్ వేర్ లో అట్రాక్ట్ చేస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. నెట్టింట గ్లామర్ మెరుపులతో అభిమానులను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు.