- Home
- Entertainment
- స్టార్ హీరోల ప్రైవేట్ పార్ట్స్ నొక్కుతారు, అది కూడా అబ్బాయిలు... షాకింగ్ మేటర్ వెలుగులోకి తెచ్చిన పూరి
స్టార్ హీరోల ప్రైవేట్ పార్ట్స్ నొక్కుతారు, అది కూడా అబ్బాయిలు... షాకింగ్ మేటర్ వెలుగులోకి తెచ్చిన పూరి
దర్శకుడు పూరి జగన్నాధ్ ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాడు. ఈ డైనమిక్ డైరెక్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. హీరోయిన్స్ పట్ల కొందరి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయన చెప్పుకొచ్చాడు.

హీరోయిజం కి కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకరు. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అనొచ్చు. ఆయన తెరకెక్కించిన బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, పోకిరి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచాయి. అయితే పూరి కొన్నాళ్లుగా తన మార్క్ కోల్పోయాడు. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నారు.
ఇస్మార్ట్ శంకర్ తో ఫార్మ్ లోకి వచ్చాడు అనుకుంటే... లైగర్ మూవీతో దెబ్బపడింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన లైగర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. విజయ్ దేవరకొండతో వెంటనే స్టార్ట్ చేసిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్నాడు.
కెరీర్ సంగతి అటుంచితే... పూరి జగన్నాధ్ ముక్కుసూటి మనిషి. ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాడు. పబ్లిక్ లో హీరోలు, హీరోయిన్స్ తో ఫ్యాన్స్ ప్రవర్తించే తీరుపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో సినిమా వాళ్లకు పబ్లిక్ లో ఇబ్బందులు తప్పడం లేదు.
హీరోయిన్స్ కనబడితే వాళ్ళతో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. తాకాలని చూస్తారు. అందుకే పబ్లిక్ లోకి రావాలంటే హీరోయిన్స్ భయపడతారు. హీరోయిన్స్ ని పట్టుకుని లాగేస్తారు. నొక్కేస్తారు. వాళ్ళ బట్టలు చించేస్తారు.
Puri jagannadh
మీకు తెలియని షాకింగ్ విషయం ఒకటి చెప్పనా... హీరోలకు కూడా ఈ వేధింపులు తప్పవు. హీరోల బాల్స్ నొక్కేస్తారు. అది కూడా అబ్బాయిలే. అందుకే హీరోలకు కూడా ఫ్యాన్స్ వస్తున్నారంటే భయం. మొబైల్స్, చేతి గడియారాలు, యాక్సెసరీలు ఏమైనా ఉన్నా లాగేసుకుని వెళ్ళిపోతారు. అంత దారుణంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందని పూరి వెల్లడించాడు...
ఫ్యాన్స్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అయిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. అయితే హీరోల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని అసలు ఊహించలేదు. పూరి జగన్నాధ్ ఓ షాకింగ్ ఫ్యాక్ట్స్ భయపెట్టారు. అందుకే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ మీద కూడా హీరోలు కోప్పడతారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.