- Home
- Entertainment
- దిల్ రాజు మాస్టర్ స్ట్రోక్ కి చిరంజీవి-బాలయ్య బలి.... మైత్రీ మూవీ మేకర్స్ కోట్లు నష్టపోనున్నారా?
దిల్ రాజు మాస్టర్ స్ట్రోక్ కి చిరంజీవి-బాలయ్య బలి.... మైత్రీ మూవీ మేకర్స్ కోట్లు నష్టపోనున్నారా?
డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కనుసన్నల్లో నడిపిస్తున్న దిల్ రాజు టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి-బాలయ్యల సంక్రాంతి చిత్రాలను దిల్ రాజు ఊహించని దెబ్బతీయనున్నాడట.

Chiranjeevi-Balakrishna
2023 సంక్రాంతి సమరం దిల్ రాజు వర్సెస్ మైత్రీ మూవీ మేకర్స్ అన్నట్లు నడుస్తుంది. దిల్ రాజు అధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ మొండిగా ముందుకు వెళుతున్నారు. అంతకు మించి మేటర్ సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు పక్కా ప్లాన్ సిద్ధం చేసిపెట్టాడట. దిల్ రాజు ఇచ్చే మాస్టర్ స్ట్రోక్ కి మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నష్టపోవడం ఖాయమంటున్నారు.
WaltairVeerayya, VeeraSimhaReddy
గత ఎనిమిదేళ్లలో మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా ఎదిగింది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప, ఉప్పెన, సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈ సంస్థ తెరకెక్కించింది. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలతో చిత్రాలు నిర్మిస్తుంది. కొన్ని రానున్న కాలంలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
Dil Raju
కోట్లు పెట్టి సినిమా తీసి అది దిల్ రాజు చేతిలో పెట్టాల్సి వస్తుంది. దిల్ రాజు విషయంలో మైత్రి మూవీ మేకర్స్ విసిగిపోయారు. డిస్ట్రిబ్యూషన్ లో అడుగు పెట్టడం ద్వారా విడుదల ఇబ్బందులు అధిగమించవచ్చు. ముఖ్యంగా దిల్ రాజు అధిపత్యానికి చెక్ పెట్టొచ్చని మైత్రీ మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసి తాము నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను సొంతంగా విడుదల చేస్తున్నారు.
Veerasimhareddy
దిల్ రాజు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడట. ఎప్పటికీ దిల్ రాజుతో పెట్టుకోకూకుండా మైత్రీ మూవీ మేకర్స్ భయపడేలా వ్యూహం పన్నాడట. దీని కోసం దిల్ రాజు ప్లాన్ A అండ్ ప్లాన్ B సిద్ధం చేసిపెట్టాడు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు థియేటర్స్ దొరక్కుండా పెద్ద స్కెచ్ వేశాడు. తాను నిర్మాతగా ఉన్న వారసుడు చిత్రం కోసం వంద సెంటర్స్ కి పైగా బ్లాక్ చేసిపెట్టాడు.
అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ లతో కలిసి దిల్ రాజు థియేటర్స్ సిండికేట్ ఏర్పాటు చేశారు. దానికి దిల్ రాజు హెడ్. వాళ్ళ అనుమతి లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీస థియేటర్స్ లభించవు. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్స్ వారి కనుసన్నల్లోనే పనిచేస్తారు. దిల్ రాజు సెట్ చేసిన సెంటర్స్ లో మేజర్ థియేటర్స్ వారసుడికి దక్కుతాయి. సింగిల్ స్క్రీన్ సెంటర్స్ లో వారసుడు ఆడుతుంది. డబుల్ స్క్రీన్ సెంటర్స్ లో వారసుడుతో పాటు చిరంజీవి లేదా బాలయ్య సినిమా ఆడుతుంది.
ఒకవేళ వారసుడు ప్లాప్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు ఇవ్వాల్సి వస్తే... అలా జరగకుండా మరో ప్లాన్ B అమలు చేస్తాడట. చిన్న చిత్రం కళ్యాణం కమనీయం జనవరి 14న విడుదల కానుంది. వారసుడు మూవీ తొలగించిన థియేటర్స్ కళ్యాణం కమనీయం చిత్రానికి కేటాయిస్తారట.
బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా... వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ పెరిగే సూచనలు లేవంటున్నారు. ఈ క్రమంలో టాక్ తో సంబంధం లేకుండా చిరు బాలయ్య చిత్రాలు ఓపెనింగ్స్ భారీగా కోల్పోనున్నాయి. దిల్ రాజు ఇచ్చే షాక్ కి మైత్రీ మూవీ మేకర్స్ తనకు ఎదురెళ్లాలనే ఆలోచన కూడా చేయకూడని సీరియస్ గా అడుగులు వేస్తున్నాడట. ఈ సంక్రాంతి సమరం హీరోల మధ్య కాకుండా పరిశ్రమపై ఆధిపత్యం ఎవరిదన్నట్లు సాగనుంది.