- Home
- Entertainment
- Guppedantha Manasu: టెన్షన్తో వణికిపోతున్న దేవయాని.. జగతి దంపతులను టార్గెట్ చేసిన శైలేంద్ర?
Guppedantha Manasu: టెన్షన్తో వణికిపోతున్న దేవయాని.. జగతి దంపతులను టార్గెట్ చేసిన శైలేంద్ర?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అధికారం కోసం అయిన వాళ్ళనే చంపాలని చూస్తున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి కార్లో వెళ్తూ ఉంటాడు కాలేజీలో జరిగిన సంఘటనలని తలుచుకొని మళ్ళీ వసుధారతో కలిసి ట్రావెల్ చేయాలా అని ఇబ్బంది పడతాడు కానీ మళ్ళీ తనని తానే మోటివేట్ చేసుకుంటూ పవర్ ఆఫ్ స్టడీస్ అనేది మిషన్ ఎడ్యుకేషన్ అంత పెద్ద సక్సెస్ చేయాలి దానికోసం నేను కష్టపడతాను ఈ ప్రయాణంలో ఎవరు ఎదురైనా నేను పట్టించుకోను.
గత జ్ఞాపకాలు నాకు గాయం చేయకూడదు అని అనుకుంటాడు. మరోవైపు బట్టలు సర్దుతూ మనం ఎప్పుడు బయలుదేరుతాము అని మహేంద్రని అడుగుతుంది జగతి. రేపు మధ్యాహ్నం బయలుదేరుదాం నైట్ రెస్ట్ తీసుకుని తర్వాత రోజు మార్నింగ్ కాలేజీకి వెళ్దాము అంటాడు మహేంద్ర. రిషి ని తలుచుకొని ఎమోషనల్ అవుతుంది జగతి.
తనకి నా మీద కోపం ఇంకా అలాగే ఉందంటావా నాతో మాట్లాడుతాడంటావా ఏ తల్లి చేయకూడని ద్రోహం నా కొడుక్కి చేశాను వాడు నన్ను క్షమిస్తాడా అంటూ బాధపడుతుంది. వాడు క్షేమం కోసమే కదా చేసావు ఏమి బాధపడొద్దు అని ధైర్యం చెప్తాడు మహేంద్ర. మనం వెళ్తున్న విషయం బావగారికి చెప్పొద్దు అలా చెప్తే శైలేంద్ర వాళ్లకి కూడా తెలుస్తుంది అంటుంది జగతి.
ఆ మాటలు అనుకోకుండా వింటాడు శైలేంద్ర. తల్లి దగ్గరికి వెళ్లి పిన్ని బాబాయ్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అంటాడు. రేపు వాళ్లని నువ్వు ఫాలో అవ్వు ఒకవేళ వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నట్లయితే కనుక అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీదే అంటుంది దేవయాని. మరోవైపు రిషి ఇంటికి వెళ్లేసరికి కాలేజీ కార్ తో పాటు డ్రైవర్ ఉంటాడు.
వసు కోసం వచ్చాడు అని తెలుసుకొని తను రాదు నేను ప్రిన్సిపాల్తో మాట్లాడాను అని చెప్పి డ్రైవర్ని పంపించేస్తాడు రిషి. అంతలోని రెడీ అయి వస్తున్న వసుధారని గుమ్మంలోనే ఆపేసి ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు ఒకవేళ వెళ్తే కాలేజీకి కాకుండా అట్నుంచి అటే హాస్పిటల్ కి వెళ్ళవలసి వస్తుంది అంటాడు రిషి. నేను పని చేయ లేకుండా ఖాళీగా ఉండలేకపోతున్నాను.
నేను పని చేస్తేనే నా మనసుకి అయినా గాయాన్ని మర్చిపోగలను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంటుంది వసుధారా. మీ మనసుకి గాయం అయితే ఇంత బాధ పడుతున్నారు మరి ఎదుటి వాళ్ళ మనసు గురించి ఆలోచించరా అంటాడు రిషి. ఆ పనేదో ఇంట్లోంచి చేద్దురుగాని నేను చెప్తాను అనటంతో లోపలికి వెళ్ళిపోతుంది వసుధార. మరోవైపు కారులో బయలుదేరిన జగతి వాళ్ళని ఫాలో అవుతాడు శైలేంద్ర.
రిషి ని కలవబోతున్నందుకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటుంది జగతి. రిషి ఎదురు పడగానే మనం తన కోసమే వచ్చాము అని బయట పడిపోకు అంటాడు మహేంద్ర. చాలా రోజుల తర్వాత నా కొడుకుని చూడబోతున్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంటుంది జగతి. అదే నేను వద్దనేది రిషి నిన్ను అర్థం చేసుకునే వరకు వెయిట్ చేయాలి అని చెప్తాడు మహేంద్ర.
మరోవైపు శైలేంద్ర ఫోన్ కోసం వెయిట్ చేస్తూ అసలు జగతి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది దేవయాని. అంతలోనే ధరణి వచ్చి భోజనానికి పిలుస్తుంది. టెన్షన్ లో ఉన్న దేవయాని నేను వస్తానులే నువ్వు వెళ్ళు అంటుంది. మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అంటుంది ధరణి. అవన్నీ నీకెందుకు ఈమధ్య నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి ఎవరిని చూసుకొని నీకు అంత ధైర్యం అంటుంది దేవయాని.
ఇంతలో శైలేంద్ర ఫోన్ చేయడంతో ధరణిని అక్కడి నుంచి పంపించేసి తలుపు వేసేస్తుంది. పిన్ని వాళ్ళు ఇక్కడ హోటల్లో స్టే చేశారు నేను అక్కడే ఉన్నాను అంటాడు శైలేంద్ర. వాళ్లు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించు అంటుంది దేవయాని. మనకు విరుద్ధంగా ఏమైనా చేస్తే మాత్రం రిషి ఉన్నచోటకే వీళ్ళని కూడా పంపిస్తాను. నాకు నీకు ఉన్నంత ఓపిక లేదు మన చంపుకుని నటించడం వల్ల కాదు అంటాడు శైలేంద్ర.
తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు మనమే చిక్కుల్లో పడతాం అంటుంది దేవయాని. నీకు ఉన్నంత సహనము సెంటిమెంటు నాకు లేదు అని మనసులో అనుకుని ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ లో స్టెప్ పవర్ ఆఫ్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కాలేజీ స్టాప్, స్టూడెంట్స్ మరియు రిషి, వసుధార వాళ్ళు. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.