అనసూయ, రష్మీలకు షాక్ ఇస్తున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి.. మతిపోగొడుతున్న నయా పిక్స్
First Published Jan 3, 2021, 9:49 AM IST
`ఢీ ఛాంపియన్` 13వ సీజన్లో సందడి చేస్తుంది క్యూట్ బ్యూటీ దీపికా పిల్లి. టిక్‌టాక్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు టాప్ యాంకర్లకే ఎసరు పెట్టబోతుందట. ఈ అమ్మడి దూకుడు ఇలానే కొనసాగితే, వారి ప్లేస్‌లు గల్లంతే అంటున్నారు నెటిజన్లు. నయా పిక్స్ తో మతిపోగొడుతుంది దీపికా పిల్లి.

సోషల్ మీడియా వచ్చాక మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా, టిక్ టాక్ వంటి సాధనాలు అనేక మందిని బయటకు తీసుకొస్తున్నాయి. వారిలో ఉన్న ప్రతిభని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి.

ప్రస్తుతం `ఢీ13` డాన్స్ షోలో క్వీన్ టీమ్‌కి లీడర్‌గా వ్యవహరిస్తున్న దీపికా పిల్లి విషయంలో అదే జరిగింది. ఈ అమ్మడు టిక్‌టాక్ ద్వారా పాపులర్ అయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?