దీపికా పదుకొనె బ్రాండెడ్‌ బ్యాగ్‌ కలెక్షన్లు, వాటి ధరలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

First Published Jan 16, 2021, 1:45 PM IST

స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఏం ధరించినా అది స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అవుతుంది. వారు ప్రతిదీ బ్రాండ్‌ వాడుతుండటంతో అది హైలైట్‌ అవుతుంది. అలా స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె వాడే బ్యాగ్‌లు కూడా స్పెషాలిటీని సంతరించుకున్నాయి. ఆమె బ్రాండెడ్‌, కాస్ట్లీ బ్యాగ్‌లను వాడటం ఓ ఎత్తైతే, డ్రెస్‌ మ్యాచింగ్‌ని బట్టి వాడటం మరో విశేషం. అందుకే ఆమె వాడే బ్యాగ్‌లు ప్రత్యేకంగా నిలుస్తుంది. మరి వాటి ధరెంతో తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే.