'హరిహర వీరమల్లు'పై కామెంట్స్.. కాంట్రవర్షియల్ క్రిటిక్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు.. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. భారీ సెట్స్, యాక్షన్స్ ఎపిసోడ్స్ తో క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మనసు పెట్టి నటిస్తుండడంతో ఫ్యాన్స్ బోలెడు అసలు పెట్టుకుని ఉన్నారు.
అయితే వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా హరి హర వీరమల్లు చిత్రంపై కామెంట్స్ చేశాడు. ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అన్నట్లుగా ఉమైర్ సంధు పవన్ కళ్యాణ్ మూవీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రషెష్ చూశారట.
అవుట్ పుట్ పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారట. దీనితో దర్శకుడిపై, టెక్నికల్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉమైర్ సందు తన ట్విటర్ లో పేర్కొన్నారు. హరిహర వీరమల్లు చిత్రం గురించి సందర్భం లేకుండా నెగిటివ్ కామెంట్స్ చేయడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
అసలు ఈ సమాచారం నీకు ఎలా వచ్చింది.. నువ్వు హరిహర వీరమల్లు చిత్రాన్ని లైట్ బాయ్ గా పనిచేస్తున్నావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. నీకు ఫేక్ న్యూస్ సృష్టించడం ఒక్కటే పనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హరిహర వీరమల్లు చిత్రాన్ని దర్శకుడు క్రిష్.. ఔరంగజేబు కాలం నాటి కథతో పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పేదలకు అండగా నిలిచే బందిపోటు పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ లుక్ విభిన్నంగా ఉండడంతో ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.