‘జై హనుమాన్’ పై పెట్టిన లీగల్ కేసు ఏమైంది?
రిషబ్ శెట్టి నటించిన 'జై హనుమాన్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వివాదంలో చిక్కుకుంది. హనుమంతుని ముఖానికి బదులుగా రిషబ్ శెట్టి ముఖం చూపించడాన్ని తప్పుబడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కేసు నమోదైంది.
Rishab Shetty
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా క్రితం ఏడాది సంక్రాంతికి విడుదలై అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా రూపొందుతున్నదే ‘జై హనుమాన్’. ఈ సీక్వెల్ ‘హనుమాన్’కి మించి ఉంటుందని, ఆంజనేయస్వామి పాత్రను స్టార్ హీరోగా పోషిస్తారని ప్రశాంత్ వర్మ చెప్పిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఎక్సపెక్టేషన్స్ బాగా భారీగా పెరిగాయి.
ఈ క్రమంలో అనేక మంది స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ఈ సీక్వెల్‌లో కీలకాంశం. ‘హనుమాన్’లో హనుమంతుగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు.
Rana Daggubati, Jai Hanuman, Prasanth varma
‘జై హనుమాన్’ (Jai Hanuman)లో హనుమంతుడిగా కనిపించేది ఎవరా? అని ఎదురు చూస్తున్న సినీ ప్రియుల ఉత్కంఠకు ఆ మధ్యన తెర వేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. దీపావళిని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ (Jai Hanuman Movie First Look) చేస్తే వైరల్ అయ్యింది.
‘కాంతార’తో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి (Rishab Shetty) ‘జై హనుమాన్’లో ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారని అఫీషియల్ గా తేల్చి చెప్పారు. ఈ మేరకు పోస్టర్‌ను (Jai Hanuman movie poster) విడుదల చేశారు. అయితే ఇప్పుడా ఫస్ట్ లుక్ పై లీగల్ కేసు పడింది.
ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాముడి విగ్రహాన్ని పట్టుకుని కూర్చొన్న రిషభ్‌శెట్టి ఫొటో సినిమాపై అంచనాలను పెంచింది. అయితే అదే సమయంలో ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతలు అయినటువంటి నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ అలాగే స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) , దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma)..ల పై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదైంది. ప్రముఖ న్యాయవాది మామిడాల తిరుమల రావు వాళ్ళ పై కేసు పెట్టారు.
కేసు ఏమిటంటే... హనుమంతుని ముఖచిత్రం బదులు హీరో రిషబ్ శెట్టి మొహం చూపించడాన్ని కొందరు తప్పు బట్టారు. ’భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే’ అంటూ దీనిని ఖండిస్తూ ఆయన కేసు వేసారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇక ఈ కేసుపై ‘మైత్రి’ వారు, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో రిషబ్ శెట్టి.. ఎలా స్పందిస్తారు అనేది మీడియాలో ఆసక్తికరమైన విషయంగా మారింది.
Actor Rishab Shetty likely to play lead in Prasanth Varma's Jai Hanuman
‘జై హనుమాన్’కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చిత్ర వర్గాల సమాచారం. ఇక ఈ మూవీని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్‌లో తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. "త్రేతాయుగంలో ఇచ్చిన మాట కలియుగంలో నెరవేరుతుంది. విధేయత, ధైర్యం, భక్తితో కూడిన ఇతిహాసగాథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది -ఎక్స్ వేదికగా రిషభ్‌శెట్టి"
.