విశ్వంభరలో చిరంజీవి డ్యూయెల్ రోల్.. అది కూడా మామూలుగా కాదు, దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిన యువీ క్రియేషన్స్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్, కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.
Vishwambhara
కళ్ళు చెదిరే విజువల్స్ తో ఫాంటసీ డ్రామాగా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాన్సెప్ట్ వీడియోలో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో చిరు ముల్లోకాలు తిరిగే వీరుడిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ చిత్ర కథపై పూర్తి స్థాయి సమాచారం లేదు. కాన్సెప్ట్ వీడియోలో ఇతర లోకాల నుంచి ఒక పెట్టె భూమిపై పడుతుంది. అందులో ఉన్న మతలబు ఏంటనేది ఎవరికీ తెలియదు. చిరంజీవి ముల్లోకాలని చుట్టి వచ్చే వీరుడు అని అంటున్నారు. అయితే ఈ వీరుడు ఏ ఆశయంతో ముల్లోకాలు తిరుగుతాడు అనేది కూడానా స్పస్పెన్.
అసలు విశ్వంభర కథ ఏంటి అంటూ జుట్టు పీక్కుంటున్న మెగా ఫ్యాన్స్ కి ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. ఈ అప్డేట్ తో కథ గురించి చిన్న హింట్ వచ్చినట్లు అయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ సంస్థ ఆడిషన్స్ కోసం ఓ ప్రకటన చేసింది. మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటించేందుకు 5 ఏళ్ళ లోపు వయసు ఉన్న ఇద్దరు అబ్బాయిలు కావాలి.. కానీ కచ్చితంగా ట్విన్స్ అయి ఉండాలి అంటూ ట్విస్ట్ ఇచ్చారు.
ఈ చిత్రంలో ఇద్దరు కవల పిల్లలు నటిస్తున్నారు అంటే చిరంజీవి డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు ఫిక్స్ అయిపోవచ్చు అని అంటున్నారు. చిన్ననాటి చిరంజీవి పాత్ర కోసమే చిత్ర యూనిట్ కవల పిల్లల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.
జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ తరహా అంచనాలు మెగాస్టార్ విశ్వంభరపై నెలకొన్నాయి. దర్శకుడు వశిష్ట భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.