గుండుతో అదరగొడుతున్న స్టార్ హీరోలు వీరే!
కథ కోసం, పాత్ర కోసం ప్రయోగాలు చేసేందుకు హీరోలు వెనకాడదు. కమల్ హాసన్, విక్రమ్, అమీర్ ఖాన్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ముందే ఉంటారు. పాత్ర కోసం గుండుగా కనిపించేందుకు సిద్ద పడ్డారు. తాజాగా చిరంజీవి గుండుతో మెరవబోతున్నారు.
చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత ఆయన `వేదాలం` రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.ఈ సినిమాలోని లుక్ కోసం ఇటీవల గుండుతో కనిపించారు చిరు. దీనికి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా గుండుతో కనిపించిన హీరోలెవరో ఓ లుక్కెద్దాం.
తెలుగులో గుండులో కనిపించే హీరోల జాబితాలో బాలకృష్ణ కూడా చేరబోతున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి అఘోరగా గుండుతో కనిపించనున్నారని సమాచారం.
హీరో రాజశేఖర్ సైతం `శేషు` చిత్రంలో కాసేపు గుండుతో కనిపించి ఏడిపించాడు.
తమిళంలో కమల్‌హాసన్ ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆయన `అభయ్` చిత్రంలో గుండుగా కనిపించి నెగటివ్ షేడ్ ఉన్నపాత్రలో ఆకట్టుకున్నారు. `ఉత్తమ విలన్`లోనూ కళాకారుడిగా కాసేపు గుండుతో మెప్పించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్సైతం గుండుతో అదరగొట్టాడు. ఆయన `శివాజీ` చిత్రంలో గుండుతో కనిపించి వాహ్ అనిపించాడు.ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.
తమిళంలో ప్రయోగాలు చేసే హీరోల్లో విక్రమ్ ఒకరు. ఆయన `ఐ`సినిమాలో గుండుతో కనిపించి మెప్పించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పరాజయం చెందింది.
సూర్య `గజిని` సినిమాలో గుండులో అదరగొట్టాడు. గతం మర్చిపోయే పాత్రలో సూర్య విలక్షణ నటన కనబరిచి బ్లాక్ బస్టర్‌ని అందుకున్నారు.
హిందీలో గుండుతో మెప్పించిన స్లార్లు చాలానే ఉన్నారు. అందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఆయన `పా`చిత్రంలో గుండుతో, స్కూల్‌కి వెళ్ళే పిల్లాడిలా కనిపించి హిట్ కొట్టారు.
ఆ తర్వాత అమీర్ ఖాన్‌కి ఆ స్థానం దక్కుతుంది. ఆయన `గజిని` సినిమాలో గుండుతో కనిపించారు. ఇక పూర్తి గుండుతో కాకుండా పలు సినిమాల్లోనూ మెరిశారు.
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ `అగ్నిపత్` సినిమాలో గుండులో కనువిందు చేశారు. ఆయన అందులో నట విశ్వరూపం చూపించారు.
అక్షయ్ కుమార్ సైతం గుండుతో హిట్స్ అందుకున్నారు. ఆయన గతేడాది `హౌజ్‌ఫుల్ 4`లో గుండుతో కనిపించి విజయాన్నిసొంతం చేసుకున్నారు. ప్రస్తుతం `బచ్చన్ పాండే`లో కూడా గుండుతో కనిపించబోతున్నారు.
`బాజీరావు మస్తానీ` సినిమాలో యంగ్ హీరో రణ్వీర్ సింగ్ గుండుతోనే కనిపించారు. ఆయన కూడా తన అద్భుత నటనతో మెప్పించారు.
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ సైతం `హే దిల్ హై ముష్కిల్`చిత్రంలో గుండుతో కనిపించారు. ఇందులో హీరోయిన్ అనుష్క శర్మ సైతం గుండుతో ఆకట్టుకుంది.