మహేష్ మ్యాటర్ పై చిరు ఇలా అనేశాడేంటి, షాక్

First Published 5, Apr 2020, 3:15 PM

 కొన్ని కాంబినేషన్స్ తెరపై చూడటానికే కాదు..వినటానికి కూడా తెగ కిక్ ఇస్తూంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి..చిరు,మహేష్ కాంబినేషన్. గత కొద్ది నెలలు గా ఈ కాంబో గురించి మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఆహా..ఇన్నాళ్లకు ఫెరఫెక్ట్ మల్టిస్టారర్ చూడబోతున్నాం అని ఫ్యాన్స్ ఉత్సవాలు ప్రారంభించేసారు. అంతలా మీడియాలో ఊరించిన ఈ వార్త ఆ తర్వాత మహేష్ ఈ సినిమాలో చేయటం లేదు అంటూ చల్లబడిబోయింది. మహేష్ రెమ్యునేషన్ ఎక్కువ అడిగాడని, తన కొడుకు రామ్ చరణ్ ని ఈ సినిమాలో కి తీసుకొచ్చాడన్నారు. అయితే ఈ విషయమై దర్శకుడు కొరటాల శివ చాలా పట్టుబట్టాడని చెప్పుకున్నారు. ఈ వార్తల్లో ఏది నిజం..ఏది కాదు అనేది ఇంతకాలం తేలలేదు. కానీ తాజాగా చిరంజీవి ఈ విషయమై అసలు నిజం ఇదేనంటూ తేల్చి చెప్పారు. ఆయన చెప్పిన మాట విని మీడియాతో పాటు, మామూలు జనం కూడా షాక్ అయ్యిపోయారు. ఇంతకీ చిరు ఏమన్నారో చూద్దాం....

వివరాల్లోకి వెళితే...మెగా అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేమికలు సైతం  ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఆచార్య'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను మించేలా సినిమా ఉంటుందని టీమ్ చెప్తోంది.

దానికి  తోడు ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది.  మెగాస్టార్ 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన కెరీర్ లో ప్రత్యేకమైనదిగా చెప్తున్నారు.  ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ పడింది.

ఇక కొరటాల శివ ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పినప్పుడే చిత్రంలోని మరో కీలక పాత్ర గురించి స్పెషల్ గా చెప్పాడట. ఈ విషయం బయిటకు వచ్చింది. సెకండాఫ్ లో వచ్చే ఆ కీలక పాత్రలో మహేష్ నటిస్తున్నారని చాలా కాలం ప్రచారం జరిగింది. ఆయనకు భారీ రెమ్యూనరేషన్ చెల్లించి తీసుకున్నారని అనేక మాధ్యమాలలో ప్రచురించడం జరిగింది కూడా.

తర్వాత బడ్జెట్ పరిమితుల వల్ల ఆ పాత్రని మహేష్ చేయడం లేదు - రామ్ చరణ్ ని ఫైనలైజ్ చేసారంటూ మరో న్యూస్ బయటకి వచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించారు.

మెగాస్టార్ మాట్లాడుతూ.. మొదట నుండి  ఈ మూవీలోని ఓ పాత్ర కోసం కొరటాల చరణ్ నే అనుకుంటున్నారు. అయితే మహేష్ అంటూ టాక్  ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నారు.

మహేష్ నాకు బిడ్డతో సమానం, అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశం. కానీ ఈ చిత్రం కోసం మహేష్ ని అసలు అనుకోలేదు. చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోరిక కూడా చరణ్ ఈ మూవీలో నటించాలని. అలాగే మహేష్ ని కాదని రామ్ చరణ్ ని అనుకోవటం అబద్దం అన్నారు.

‘‘నేనంటే మహేష్‌కి ప్రేమ, అభిమానం. అలాగే, తనంటే నాకు చాలా ఇష్టం. తనూ నా బిడ్డలాంటి వాడు. అతనితో సినిమా చేసే అవకాశం వస్తే అద్భుతం అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ఇక రామ్ చరణ్ నటించే విషయం గురించి చెప్తూ... 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. కొరటాల - రాజమౌళి కాంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశం ఉందనేది మాత్రం దీని ద్వారా క్లారిపై చేసారనే చెప్పాలి.

షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇక కొద్ది రోజులు సమయం ఉందనగా.. ఈ మూవీ నుంచి త్రిష తప్పుకుంది. క్రియేటివ్‌ ఢిపరెన్స్‌ల కారణంగానే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. ఇక ఆ స్థానంలో వెంటనే కాజల్‌ను తీసుకొచ్చింది చిత్ర యూనిట్.

ఇక ఈ మూవీలో నటించేందుకు కాజల్‌కు భారీగా ముట్టిందనే వార్తలు కూడా నడుస్తున్నాయి.  ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ - రామ్ చరణ్ కొణెదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

loader