పవన్ పేరు వినబడితే వణికిపోతున్న ప్రొడ్యూసర్.. ఆ భయానికి కారణమేంటంటే?
పవన్ కళ్యాణ్ పేరు వింటే.. ఓ ప్రొడ్యూసర్ వణికిపోతున్నారు. ఆయన సినిమా పేరు వినబడగానే టెన్షన్‌కి గురవుతున్నారు. ఓ రకంగా ఆ నిర్మాతకి పవన్ నిద్రపట్టనివ్వడం లేదు. ఇదే లేటెస్ట్ హాట్ టాపిక్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తిరుగులేదు. టాలీవుడ్‌లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఆయనదే. క్రేజీ ఫ్యాన్స్ ఆయన సొంతం. ఆయన సినిమాలు యావరేజ్‌గానే అడినా ఫాలోయింగ్‌లో మాత్రం ఆయన తర్వాతే ఎవరైనా అనేట్టుగా ఉంటుంది. అయితే పవన్ సినిమాల నిర్మాతలు మాత్రం ఇప్పుడు భయపడుతున్నారు. టెన్షన్‌కి గురవుతున్నారు. ముఖ్యంగా పవన్ నటించిన, రిలీజ్‌కి దగ్గర పడ్డ నిర్మాత పరిస్థితి మరీ దారుణం. ఆ నిర్మాత కక్కలేని, మింగలేని పరిస్థితి నెలకొంది. కారణం ఆయనే, కానీ అసలు కారణం ఆయన కాదు. ఇదే ఇక్కడ గమ్మత్తైన విషయం. ఆ వివరాలు చూస్తే..
Bro Teaser
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం `బ్రో` చిత్రంలో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇందులో మరో హీరో. ఈఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రమిది. దీనికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇది తమిళంలో విజయం సాధించిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్. సముద్రఖని దానికి దర్శకుడు. తెలుగుకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. త్రివిక్రమ్ `బ్రో`కి మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ నెల 28న సినిమా విడుదల కాబోతుంది.
సరిగ్గా ఇదే టైమ్‌లో ఏపీలో వారాహి యాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. గత కొన్ని రోజులుగా కంటిన్యూగా ఆయన యాత్ర చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, నాయకులను ఎండగడుతున్నారు. మాటల తూటాలు వదులుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతంగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే ఆయన క్రేజ్‌ని ఏపీలో మరింత పెంచుతుంది. రాజకీయంగా మరింత బలపడుతున్నారు. జనాల ఆదరణ పొందుతున్నారు పవన్. ఈ విషయంలో ఆయన టార్గెట్‌ని రీచ్ అవుతున్నారనే చెప్పాలి. తనదైన మాటల తూటాలతో వైసీపీ ప్రభుత్వానికి, నాయకులకు చుక్కలుచూపిస్తున్నారు. సీఎంని కూడా వదలడం లేదు.
jagan, Pawan Kalyan
తన పెళ్లిళ్లలపై కామెంట్ చేసేవారిని, తనని విమర్శించే వారిని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు పవన్. రెట్టింపు ఉత్సాహంతో ఇతర పార్టీలకు షాకిచ్చేలా ఆయన యాత్ర సాగుతుంది. అయితే రాజకీయంగా దూసుకుపోతున్నప్పటికీ సినిమాల పరంగా ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నారు పవన్. ఏపీలో తన సినిమాలకు అడ్డంకులకు కారణమవుతున్నారు. గతంలో పవన్ నటించిన `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్` సినిమాల విషయంలో ఏపీలో ఎలాంటి నష్టం జరిగిందో తెలిసిందే. టికెట్ రేట్లు తగ్గించడంతోపాటు ఇతర కండీషన్ల వల్ల ఆయా సినిమాలకు తీవ్ర నష్టాలువచ్చాయి. దాదాపు ముప్పై, నలభైకోట్లు నష్టపోయినట్టు పవన్ తెలిపారు. నైజాంలో మంచి లాభాలు వచ్చినా, అక్కడి బయ్యర్లు నష్టపోయారు. నిర్మాతకి ఏపీలో బాగా లాస్ వచ్చింది.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం పవన్..ఏపీ ప్రభుత్వాన్ని, సీఎంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో త్వరలో విడుదల కాబోతున్న `బ్రో` సినిమాపై అది తీవ్ర ప్రభావాన్ని చూపించబోతుందని అంటున్నారు విశ్లేషకులు. జగన్ ప్రభుత్వం అక్కడ `బ్రో` సినిమాపై చాలా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుందని, టికెట్ రేట్ల విషయంలోనూ కొత్త నిబంధలు తెచ్చినా ఆశ్చర్యం లేదని, ఇది అంతిమంగా నిర్మాతకి, బయ్యర్లకి నష్టాలకు దారితీస్తుందని అంటున్నారు. అందుకే పవన్ పేరు చెబితే నిర్మాత టీజీవిశ్వప్రసాద్ వణికిపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Janasena Party Formation Day
దీనికితోడు `బ్రో` సినిమాకి పెద్దగా బజ్ లేదు. రీమేక్ కావడంతో అంతటి హైప్ రావడం లేదు. దీనికితోడు ఇది ఎమోషనల్ డ్రామా కావడంతో ఆడియెన్స్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. పవన్ మార్క్ మాస్, ఎలివేషన్లు, యాక్షన్లు ఇందులో ఉండవని తెలుస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం కాస్త అసంతృప్తితో ఉన్నారని టాక్. పైగా ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు ఆడియెన్స్ కి ఎక్కడం లేదు. ఆశించిన రేంజ్‌లో ఆ పాటలు లేవనే విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ `బ్రో` సినిమాపై ప్రభావం చూపబోతున్నాయని, ఓ వైపు ఏపీలోని రాజకీయ పరిణామాలు, ఇటు సినిమాపై ఆశించిన బజ్ లేకపోవడం రిలీజ్ రోజు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇవన్నీ నిర్మాతకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని టాక్.
ఇప్పటికే వరుస పరాజయాలు ఈ నిర్మాత(పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ)ని వెంటాడుతున్నాయి. ఈ బ్యానర్‌లో వచ్చిన `రామబాణం` దారుణమైన పరాజయం చెందింది. ఇటీవల రిలీజ్ చేసిన `ఆదిపురుష్` సైతం గట్టిగానే దెబ్బకొట్టింది. ఈ రెండు దెబ్బలతో ఉన్న నిర్మాతపై ఇప్పుడు `బ్రో` రూపంలో మరో దెబ్బ పడబోతుందా? అనే ఊహాగనాలు వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాత విశ్వప్రసాద్ టెన్షన్‌గా ఉన్నట్టు ఓ వైపు నుంచి వినిపించే వార్త. కానీ విశ్వప్రసాద్ నిర్మించే చిత్రాల్లో ఇవి ఒకటి మాత్రమే, ఆయన ఓ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక్క ప్రొడక్ట్ తేడా అయితే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, ఆ ఫ్లోటింగ్‌లో భాగమే అవుతుంది, వేల కోట్ల టర్నోవర్‌తో బిజినెస్ చేసే విశ్వప్రసాద్‌కి ఇవి చిన్న దెబ్బలే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఏం జరుగుతుంది? బ్రో రిజల్ట్ ఎలా ఉంటుంది? అనేది తెలియాలంటే జులై 28 వరకు ఆగాల్సిందే.