బాలయ్య అఘోరా నే, కన్ఫ్యూజన్ వస్తే దైవాధీనమే! : బోయపాటి ఇంటర్వ్యూ

First Published 1, May 2020, 1:56 PM

నందమూరి బాలకృష తన 106వ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష-బోయపాటిలది సక్సస్ ఫుల్  కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ షూటింగ్ మొదలెట్టిన బోయపాటి..లాక్ డౌన్ తో షూటింగ్ ఆపుచేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సినిమాకు సంభందించిన రకరకాల పనులలో బోయపాటి బిజీగా ఉన్నారు. ఇక  ఈ సినిమా గురించి రకరకాల వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి.ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది. వాటిలో రూమర్స్ ఎన్నో, నిజాలు ఎన్ని అనేది ఎవరికీ తెలియదు. అయితే "సింహా" సినిమా పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ టీవి  ఛానల్ తో  మాట్లాడిన ఈ దర్శకుడు.. బాలయ్యలో తనకు నచ్చిన అంశాలతో పాటు..తన  కొత్త సినిమా విషయాలు రివీల్ చేసాడు. బోయపాటి ఈ సినిమా గురించి  చెప్పిన  హైలెట్స్ చూద్దాం.

బాలయ్యతో చేస్తున్న కొత్త సినిమా గురించి  మాట్లాడుతూ... మా ఇద్దరి కాంబినేషన్ లో ఆడియన్స్ "సింహా" చూశారు. ఆ తర్వాత "లెజెండ్" చూశారు. ఈసారి అంతకుమించి కొత్తదనం చూపించాలి. ఆ దిశగానే వందశాతం కష్టపడ్డాను. కొత్తదనం కోసం క్యారెక్టర్ వైపు నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను. కొత్త సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారు.

బాలకృష్ణ డబల్ రోల్ చేయనున్నారు. సిటీలో ఓ పాత్ర ఉండగా వారణాసి అడవులలో మరో పాత్ర ఉండనుందని తెలుస్తోంది. 'అఘోర బాబు'గా బాలకృష్ణ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. శివుని భక్తుడుగా బాలయ్య పాత్ర చాలా అద్భుతంగా ఉండనుందని సమాచారం. అయితే ఈ వార్తలపై తాజాగా దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చారు.

తన సినిమాలో బాలకృష్ణ అఘోర గా కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా మొదటి రెండు సినిమాలకంటే ఈ సినిమా మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు. ఇక ఈసినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో బాలయ్య కనిపించనున్నారని బోయపాటి తెలిపారు.

బోయపాటి మాట్లాడుతూ.. అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్.

"సింహా", "లెజెండ్" నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాత్ర తట్టింది. కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే అని చెప్పారు.

క్వారంటీన్ గ్యాప్ లో  బాలయ్య సినిమాపైనే కూర్చున్నాం. మరిన్ని ఇన్ పుట్స్ తీసుకున్నాను. మొత్తం పేపర్ మీద పెడుతున్నాం. దీంతో పాటు ముందునుంచే అనుకున్న కొన్ని కథని పాలిష్ చేయడం స్టార్ట్ చేశాం.

ఇప్పటికైతే ఒక షెడ్యూల్ అయిపోయింది. మంచి ఎపిసోడ్, 2 సీన్లు అయిపోయాయి.  ఇలాంటి గ్యాప్ దొరకడం నిజంగా అదృష్టం. సినిమావాళ్లకు ఇలాంటి గ్యాప్ వస్తే కచ్చితంగా ఉదయం నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తారు. నా వరకు నేను కూడా అదే చేశాను.

సింహా సినిమా హిట్టైనప్పుడు బాలయ్య రియాక్షన్ గురించి చెప్తూ... బాలయ్య సినిమా రిజల్ట్ వరకు వెయిట్ చేయరు. సింహా విడుదల వరకు ఆయన వెయిట్ చేయలేదు. షూటింగ్ టైమ్ లోనే నేను స్క్రీన్ ప్లే ఆర్డర్ ప్రకారం షూటింగ్ చేశాను. మార్కెట్ ఫైట్ పూర్తయిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది.

అలాగే బాలయ్యకు సెట్స్ లోనే ఆ సినిమా విషయం  తెలిసిపోతుంది. పైకి ఎంత సరదాగా కనిపించినా, తన సినిమా ఎలా ఉండబోతోందో ఆయన మనసులో ఊహించుకుంటారు. ఈ విషయంలో ఆయన మైండ్ లో ఎప్పుడూ ఓ లేయర్ అలా తిరుగుతుంది.

"సింహా" కథను ఆయన 20 నిమిషాలే విన్నారు. చేస్తున్నాం అన్నారు. "లెజెండ్" కూడా అంతే. 20-25 నిమిషాల్లో ఓకే అన్నారు. ఆయనలో ఉన్న క్వాలిటీ అదే. బాలయ్య కొత్తదనం ఎంకరేజ్ చేస్తారు. కొత్త కథ అంటే చాలు ఆయన ప్రోత్సహిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన తగ్గరు. కొత్త కథ అనిపిస్తే ఏ దర్శకుడైనా అవకాశం ఇచ్చేస్తారు అని చెప్పారు.

ఇక బాలయ్య చాలా సరదా మనిషి. కాకపోతే కథపై క్లారిటీ ఉంటేనే. మేకర్స్ కు ఆ క్లారిటీ లేకపోతే బాలయ్యతో కష్టం. కథకు, ఆయన బాడీ లాంగ్వేజ్ కు మధ్య కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఇక ఇబ్బంది అయిపోతుంది. ఆ సినిమా దైవాధీనం అని అన్నారు.

డైరక్టర్ కు కథ మీద క్లారిటీ ఉందని బాలయ్య నమ్మితే చాలు. కథ కూడా ఆయన పూర్తిగా వినరు. చాలా తక్కువ టైమ్ వింటారు. కథ మీద వీళ్లకు గ్రిప్ ఉందని నమ్మితే చాలు ఓకే చెబుతారు. తన క్యారెక్టర్ ఏంటి, గెటప్ ఏంటని మాత్రమే ఆడుగుతారు. మిగతా విషయాలేవీ పట్టించుకోరు అని చెప్పుకొచ్చారు బోయపాటి

loader