- Home
- Entertainment
- ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్న సినీ సెలబ్రిటీ కపుల్స్.. స్టార్ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా...?
ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్న సినీ సెలబ్రిటీ కపుల్స్.. స్టార్ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా...?
ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు ఈ బాలీవుడ్ స్టార్ కపుల్. ప్రేమ కు వయసుతో సంబంధం లేదు అంటున్నారు. ప్రేమ మనసుని చూసి పుడుతుందంటున్నారు హాట్ కపుల్స్ . ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబందం లేదని , మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తున్నారు. ఐదారేళ్లు అయితే పర్వాలేదు కాని ఏకంగా 10 నుంచి 16 ఏళ్లవకు ఏజ్ గ్యాప్ ఉన్న స్టార్ ఎవరు..? ప్రేమలో మునితితేలుతున్నవారు ఎవరో చూద్దాం.

నిజమే ప్రేమకు వయసుతో సంబంధంలేద. ఏ వయస్సులో అయినా.. ఎంత గ్యాప్ ఉన్నా సరే.. కాని 10 ఏళ్లు పెద్దవాళ్లు, 15 ఏళ్లు చిన్నవాళ్లతో ప్రేమ అంటే వినడానికి, చూడటానికి ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయిన కపుల్స్ చాలా మంది ఉన్నారు. అంతెందుకు రీసెంట్ గా ఒక్కటైన రణబీర్, ఆలియా రణ్ భీర్ కూడా ఏజ్ గట్టిగా ఉన్నవాళ్లే..
29 ఏళ్ల వయసులో, కెరీర్ ఫుల్ స్పీడ్ మీదున్న టైమ్ లో ఆలియా పెళ్లి చేసుకుంది. రణబీర్ కూడా ముందు జాగ్రత్తగా 40 ల్లోకి వెళ్లకుండానే 39 కే పెళ్లిపీటలెక్కాడు. ఎగ్జాక్ట్ గా వీళ్ల మధ్య ఏజ్ గ్యాప్ అక్షరాల 10ఏళ్లు.రణబీర్ -ఆలియాకి 10 ఏళ్ల వయసుతేడా ఉన్నా కూడా కరెక్ట్ మెచ్యూరిటీతో తమ లవ్ లైఫ్ ని పెళ్లివరకూ తీసుకెళుతున్నారని తెగఆనంద పడుతున్నారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ హృతిక్ రోషన్ మళ్లీ ప్రేమలో పడ్డారని సోషల్ మీడియా తెగ హడావిడి చేస్తోంది. 48 ఏళ్ల హృతిక్ రోషన్, 31 ఏళ్ల యంగ్ అమ్మాయి సబా తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారని బాలీవుడ్ టాక్. సుజానే ఖాన్ తో డివోర్స్ అయిన తర్వాత తనకంటే 17 ఏళ్లు చిన్నదైన సబా ఆజాద్ అనే అమ్మాయితో సమ్ ధింగ్ సమ్ థింగ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్ అంతేకాదు ..ఇద్దరూ కలిసి డిన్నర్లకు కూడా వెళ్లడంతో నిజమే అని ఫిక్స్ అవుతున్నారు జనాలు .
ఇక బాలీవుడ్ లవ్ కపుల్స్ లో ఏజ్ గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా. సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ ఖాన్ , మోడల్ మలైకా అరోరా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ డిఫరెన్సెస్ రావడంతో డివోర్స్ తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక 48 ఏళ్ల మలైకా.. 36 ఏళ్ల హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో మునిగితేలుతోంది. 12ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్న ఈ ఇద్దరూ త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారట. వీరి ఏజ్ గ్యాప్ గురించి ఈమద్య స్పందించింది మలైకా.. నా కంటే చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేమింది అంటూ ట్రోలర్స్ నోరు మూయించింది.
ఇటు మలైకా అర్జున్ కపూర్ తో తన దారి తను చూసుకుంటే ..అటు ఆర్బాజ్ ఖాన్ కూడా జార్జియా ఆండ్రియా తో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు . 54 ఏళ్ల ఆర్బాజ్ ఖాన్... తనకంటే 15 ఏళ్లు చిన్నదైన జార్జియా ఆండ్రియా తో కలిసి ఉంటున్నారు. త్వరలో పెళ్లి చూడా చేసుకోబోతున్నారట.
అటు బాలీవుడ్ బ్రహ్మచారి.. కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పెళ్ళి చేసుకోకపోయినా.. తనకంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. 56 ఏళ్ల సల్మాన్ ఖాన్ .. 41 ఏళ్ల లులియా వాంటూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.
బాలీవుడ్ మరో స్టార్ కపుల్ ప్రియాంకా చోప్రా..భర్త నిక్ జోనస్ మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువే . 39 ఏళ్ల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. 29ఏళ్ల నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా అది జస్ట్ ప్రపంచానికే కానీ మాకు, మా ప్రేమకు కాదు అంటన్నుస్టార్ కపుల్.
ప్రేమకు వయసుతో పనిలేదని ప్రూవ్ చేసిన మరో బాలీవుడ్ హాట్ కపుల్.. సైఫ్ అలీఖాన్ , కరీనా కపూర్. ఆల్రెడీ డివోర్స్ అయిన 51 ఏళ్ల వయసున్న సైఫ్ అలీ ఖాన్ ని వయసులో 10 ఏళ్లు చిన్నదైన 41 ఏళ్ల కరీనా కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా చక్కగా కాపురం చేసుకుంటూ. ఇద్దరు బిడ్డలకు కూడా కన్నారు ఈ జంట ఇలా ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేస్తూ బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ జంటలు.