ఫారెన్ ప్రియుడిని పరిచయం చేసిన పవన్ కల్యాణ్ హీరోయిన్, పెళ్ళి చేసుకోబోతున్న నిఖీషా పటేల్
హీరోయిన్ నిఖీషా పటేల్ గుర్తు ఉందా..? హీరోయిన్ గా తక్కువ సినిమాలే చేసినా.. కుర్రాళ్లను ఊర్రూతలూగించింది బ్యూటీ. ఇక రీసెంట్ గా ఈ భామ ఓ షాకింగ్ గుడ్ న్యూస్ చెప్పింది.
Nikesha Patel
నిఖీషా పటేల్... చాలా మందికి తెలిసుంటుందో లేదో తెలియదు కాని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోయిన్ అంటే అందరికీ గుర్తొస్తుంది. 2010లో వచ్చిన 'కొమురం పులి' మూవీలో పవర్ స్టార్ జోడీగా నటించింది నిఖీషా పటేల్. ఈ ఒక్క సినిమాతోనే తన గ్లామర్ తో ఆకట్టుకుంది నిఖీషా.
Nikesha Patel
అయితే కొమురం పులి తరువాత నిఖీషాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఎంత ప్రయత్నం చేసినా పెద్దగా ఉపయోగం లేకవపోడంతో ఇతర భాషలపై దృష్టి పెట్టింది నిఖీషా. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.
Nikesha Patel
తమిళ, కన్నడలో భాషల్లో సినిమాలు అయితే చేసింది కాని.. ఆమె వరుస సినిమాలు చేసింది కాని ఎందుకో సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పింది బ్యూటీ ఆతరువాత కనిపించకుండా పోయింది. సినిమాలు మానేసినా.. సోషల్ మీడియా ద్వార ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది బ్యూటీ.
Nikesha Patel
నిఖీషా పటేల్ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో టచ్ లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అందిస్తూనే ఉంది. ఇక తాజాగా దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ కు షాకింగ్ గుడ్ న్యూస్ చెప్పింది నిఖీషా. ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తాను ఒక ఫారెనర్ ను లవ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది చిన్నది.
అంతే కాదు తను ప్రేమిస్తున్న ఫారెనర్ తో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నానని తెలిపింది. అంతేకాదు... తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.
ఇక నిఖీషా శేర్ చేసిన ఫోలోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.