- Home
- Entertainment
- Payal Rajput: హాట్ సిట్టింగ్ ఫోజులో పాయల్ టెంప్టింగ్ లుక్స్... ఆర్ఎక్స్ 100 భామ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
Payal Rajput: హాట్ సిట్టింగ్ ఫోజులో పాయల్ టెంప్టింగ్ లుక్స్... ఆర్ఎక్స్ 100 భామ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
హాట్ ట్రెండీ వేర్ లో మరోమారు హద్దులు దాటేసింది పాయల్. హాట్ సిట్టింగ్ ఫోజులో టెంప్టింగ్ లుక్స్ ఇచ్చారు. అమ్మడు గ్లామర్ మతిపోగోడుతుండగా సోషల్ మీడియా షేక్ అవుతుంది.

Payal Rajput
పిచ్చెక్కించే గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ ఉండి కూడా పాయల్ (Payal Rajput) కి బ్రేక్ రాలేదు. ఆమె స్టార్ హీరోయిన్ హోదా అందుకోలేకపోయింది. వరుస ప్లాప్స్ పాయల్ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించాయి. అడపాదడపా హిట్స్ దక్కినా... కెరీర్ కి పునాది పడలేదు.
Payal Rajput
ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తో అదిరిపోగా.... ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతుందని అందరూ భావించారు. అనూహ్యంగా పాయల్ కెరీర్ మాత్రం గతుకుల రోడ్డుపై ఎద్దుల బండి నడకలా సాగుతుంది.
Payal Rajput
పాయల్ గ్లామర్ కి కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ తో రొమాన్స్ చేస్తుంది అనుకుంటే... ఆమె రేంజ్ ఓటీటీ కి పడిపోయింది. ఫేడ్ అవుట్ అయిన ఈషా రెబ్బా, పూర్ణ వంటి హీరోయిన్స్ తో పాటు ఓటీటీ చిత్రాలు సిరీస్లు చేస్తున్నారు. పాయల్ నటించిన 3 రోజెస్ మూవీ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది.
Payal Rajput
గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటి లో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం.హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ చేస్తున్నారు.
Payal Rajput
ఈ మూవీకి మొదట కిరాతక అనే టైటిల్ అనుకున్నారు. దాన్ని తీస్ మార్ ఖాన్ అని మార్చడం జరిగింది. తీస్ మార్ ఖాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పాయల్ పరిస్థితి కూడా అదే కాగా... తీస్ మార్ ఖాన్ వీరిద్దరికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.అలాగే మంచు విష్ణుకు జంటగా ఓ చిత్రం చేస్తున్నారు.
అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు.
Payal rajput
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నా యూత్ లో పాయల్ క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికి కూడా పాయల్ అంటే పడిచచ్చే కుర్రకారు ఎందరో ఉన్నారు.ప్రస్తుతం పాయల్ ప్రియుడు సౌరభ్ దింగ్రాతో చట్టపట్టాలేసుకు తిరుగుతుంది. పాయల్ బుల్లితెర నటిగా ఉన్నప్పటి నుండే వీరికి పరిచయం ఉంది. సౌరభ్ మ్యూజిక్ కంపోజర్ కమ్ యాక్టర్. అతడితో కలిసి కొన్ని మ్యూజిక్ ఆల్బంలో కూడా పాయల్ నటిస్తున్నారు.