బిగ్‌బాస్ 4 ఫేమ్ అరియానా బర్త్ డే పార్టీలో రెచ్చిపోయిన సోహైల్, అవినాష్, మోనాల్, లాస్య.. (ఫోటోస్ వైరల్)
బిగ్‌బాస్4 తో పాపులర్ అయిన అరియానా గ్లోరీ పుట్టిన రోజు వేడుక ఇటీవల జరిగింది. ముఖ్యంగా బిగ్‌బాస్ 4 సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఇందులో సోహైల్, మోనాల్, అవినాష్, మెహబూబ్, లాస్య, కుమార్‌సాయి వంటి వారు పాల్గొని సందడి చేశారు. ఆయా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మూడు రోజుల క్రితం అరియానా పుట్టిన రోజు జరిగింది. అయితే పూర్తి ప్రైవేట్ ఈవెంట్‌గా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంది. ఇందులో బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు చాలా వరకు పాల్గొని సందడి చేశారు.
అరియానా బర్త్ డే పార్టీలో మునిగి తేలారు. బాగా ఎంజాయ్ చేశారు. హౌజ్‌లోని రోజులను గుర్తు చేసుకున్నారు. వాహ్ అనిపించారు.
బిగ్‌బాస్ హౌజ్‌లో ముక్కు అవినాష్, అరియానా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండింది. అదే సమయంలో మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యింది.
తాజాగా ఈ బర్త్ డే వేడుకలో కూడా వీరిద్దరు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరు కలిసి చేసిన సందడి ఆద్యంతం ఆకట్టుకుంది. హైలైట్ అయ్యింది.
ఇక ఇందులో `బిగ్‌బాస్ 4`లో అత్యంత పాపులారిటీ పొందిన సోహైల్, హాట్ బ్యూటీ మోనాల్, దిల్సే మెహబూబ్, కుమార్ సాయి, లాస్య పాల్గొని సెలబ్రేట్ చేశారు.
అనంతరం ఫోటోలకు పోజులిచ్చారు. బిగ్‌బాస్ పూర్తయిన తర్వాత ఎక్కువ మంది ఇలా కలుసుకున్నారని చెప్పొచ్చు.
నాగార్జున.. అరియానాకి ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ చెప్పింది అరియానా. తన సంతోషాన్ని పంచుకుంది.
సోహైల్, మెహబూబ్ తమదైన స్టయిల్లో హంగామా చేశారు.
అరియానాతో మెహబూబ్, సోహైల్.
బిగ్‌బాస్ నాల్గో సీజన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తూనే `ఐ యామ్ బోల్డ్` అంటూ తానేంటో తెలిపింది అరియానా. ఎంట్రీతోనూ తానేంటో నిరూపించుకుంది.
హౌజ్‌లోనూ అదే మాదిరిగా బోల్డ్ గా ఉంటూ టాప్ 5లోకి వెళ్లి అందరికి షాక్ ఇచ్చింది.
యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా రామ్‌గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో హైలైట్ అయ్యింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
జెమినీ కామెడీ, మా స్టార్, ఈటీవీ అభిరుచి, ఐడ్రీమ్ వంటి వాటిలో హోస్టింగ్ చేసింది. స్టూడియో వన్‌లో యాంకర్‌గా చేసింది.
`నా బాయ్‌ఫ్రెండ్ మంచోడు` షార్ట్ ఫిల్మ్ కూడా చేసింది. ఇప్పుడు బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపుని, పాపులారిటీని తెచ్చుకుంది అరియానా.
ప్రస్తుతం ఆమె సొంతం ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి ఇంటర్వ్యూలు, ఇతర స్పెషల్ వీడియోలు చేస్తుంది.