రంభ, ఊర్వశి, మేనక, సిల్క్ స్మిత.. నాలోనే ఉన్నారంటోన్న మోనాల్..అది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు
First Published Jan 13, 2021, 9:18 AM IST
`బిగ్బాస్4` బ్యూటీ మోనాల్ గజ్జర్ తాజాగా ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్`లో స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయింది. `రంభ.. ఊర్వశి, మేనక, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, కత్రినా..` వీరంతా నాలోనే ఉన్నారంటోంది. ఇందులో మోనాల్ చేసింది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు అని చెప్పాలి. అంతగా ఊపేస్తుందీ సెక్సీ అందాల భామ.

`బిగ్బాస్4` హౌజ్లోనే అందాల విందుని వడ్డించింది మోనాల్. వీకెండ్లో మోనాల్ కోసమే చాలా మంది ఫ్యాన్స్ `బిగ్బాస్` చూసేవారంటే అది అతిశయోక్తి కాదు. అంతలా మెస్మరైజ్ చేసిందీ భామ.

బిగ్బాస్ పూర్తయిన వెంటనే ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. సినిమా ఆఫర్స్ అయితే ఇప్పటికీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. కానీ షోస్, ఐటెమ్ సాంగ్లు ఈ అమ్మడికి బాగానే వస్తున్నాయట.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?