పులిహోరా బ్యాచ్ అఖిల్ అంటూ సోహైల్ కామెంట్.. మళ్ళీ రాజుకున్న మోనాల్ వివాదం..
First Published Dec 10, 2020, 11:08 PM IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 95వ రోజు విభిన్నమైన టాస్క్ లతో ఇంటిసభ్యులను ఆడుకున్నాడు బిగ్‌బాస్. టైమ్ కౌంటింగ్ టాస్క్ లో అరియానా విన్నర్‌గా నిలవగా, అరియానా చింటుని ఎగతాళి చేశాడు సోహైల్. ఇంకా గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?

గురువారం ఎపిసోడ్ సోహైల్, మోనాల్ మధ్య సరదా సన్నివేశాలతో సాగింది. పనిచేసినందుకు సోహైల్.. మోనాల్ వద్ద డబ్బులడిగాడు. మేడమ్.. మేడమ్ అంటూ పని అయిపోయింది. డబ్బులు ఇవ్వండని, 250 కూలీ ఇవ్వాలన్నారు. డబ్బులతో కోటర్(మందు) కొనుక్కుని తాగుతా అన్నాడు. ఈ సందర్భంగా వీరి మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు నవ్వులు పూయించాయి.

అయితే నిన్న జరిగిన అరియానా చింటూ(టెడ్డీబేర్)పై సోహైల్ మరోసారి కామెంట్ చేశారు. అది వాష్‌లో ఉండటంతో సోహైల్.. నిన్ను బకరా చేస్తుందని, ఎమోషన్ అని చెప్పి ఇలా వదిలేసిందని కామెంట్ చేశాడు. దాన్ని కొట్టే ప్రయత్నం చేశాడు. అందుకు మోనాల్ ఆపే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కూడా దీనిపై సోహైల్, అఖిల్, మోనాల్ కామెంట్ చేసుకుంటూ నవ్వుకున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?