గోల్డెన్‌ మైక్‌ ఆఫర్‌ కొట్టేసిన అరియానా.. మోనాల్‌కి చుక్కలు చూపించింది..

First Published Dec 8, 2020, 11:46 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ 14వ వారం మంగళవారం ఓ వైపు అధికారం టాస్క్ కొనసాగగా, మరోవైపు ఓపిక టాస్క్ ఇచ్చాడు. ఇందులో మోనాల్‌ విచిత్రంగా ఎక్కి ఎక్కి ఏడ్వడం, అరియానాని డిస్టర్బ్ చేసేందుకు సోహైల్‌ రకరకాలుగా ఇబ్బంది పెట్టడం హైలైట్‌గా నిలిచింది. 

మంగళవారం ఎపిసోడ్‌ ప్రారంభం అరియానా రాణి అవ్వడంతో జరిగింది. ఆమె తన అధికారంలో ఇంటి సభ్యులు ఓ వస్తువుని ఇతరులకు ఇచ్చి, వారితో ఉన్న మెమరీని  పంచుకోవాలన్నారు. సోహైల్‌కి తన వస్తువులను అందించి వారితో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. వారు ఎందుకు ఇష్టమో చెప్పాలన్నారు. సోహైల్‌.. అభిజిత్‌కి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ ఇచ్చాడు. హారికకి కత్తి ఇచ్చాడు. గ్రీన్‌ అని మన ఫ్రెండ్‌షిప్‌ కూడా ఇలానే ఉండాలని చెప్పాడు. మోనాల్‌కి డ్రెస్‌ ఇచ్చాడు. మోనాల్‌ తనకు సిస్టర్‌లాగా అని చెప్పాడు. అరియానాకి పర్‌ఫ్యూమ్‌ ఇచ్చాడు. అఖిల్‌ కి జాకెట్‌ ఇచ్చాడు.

మోనాల్‌ రాణి అయ్యారు. హ్యాపీనెస్‌లో తొందరగా నిర్ణయాలు తీసుకుంటావని అఖిల్‌ చెప్పాడు. మిగిలిన ఏ సందర్భంలోనైనా కూల్‌గా ఉంటావని చెప్పాడు. తను అభిజిత్‌  అమ్మాయిలా, సోహైల్‌ అబ్బాయిలా, లవర్‌ని పార్టీకి పిలిచే టాస్క్ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఒకానొక దశలో అరియానా, హారిక కొట్టుకునే  సిచ్వేషన్‌ వచ్చింది.

మొత్తంగా ఈ టాస్క్ లో బెస్ట్ రూలర్‌గా అరియానాని ఎంపిక చేశారు. దీంతో ఆమె ప్రేక్షకులకు తానకి ఓట్లు వేసి సపోర్ట్ చేయాలని అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించాడు.  అరియానా ప్రేక్షకులకు అప్పీల్‌ చేసుకుంది. మీ వల్లే ఇంత దూరం వచ్చానని, ఇంకా ఒక్క మెట్టు ఎక్కించాలని, ప్రేమ కావాలని, ఓట్లే వేసి సాయంచేయాలని వేడుకుంది. ఈ  సంద్భంగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

మంత్రిగా అఖిల్‌ చేసిన దాని విషయంలో సోహైల్‌ గరంగా ఉన్నాడు. అందుకు మోనాల్‌ మధ్యవర్తిగా వ్యవహరించింది. ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసింది. రాత్రి ఎట్టకేలకు అఖిల్‌  వచ్చి సోహైల్‌ని హగ్‌ చేసుకున్నాడు. దీంతో ఇది అప్పుడే చేస్తే బాగుండేదిగా, ఇంత పంచాయితీ చేసేవాడిని కాదని సోహైల్‌ అన్నారు. మరోవైపు హారిక కూడా ఓ లెటర్‌ పెట్టాడు  అఖిల్‌. హారిక వచ్చి అఖిల్‌ని హగ్‌ చేసుకుంది.

రెండో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీని ప్రకారం ఓపికని పరీక్షించడం. ఇందులో ఒక సభ్యుడు టాస్క్ లో ఉన్నప్పుడు మిగిలిన వారు డిస్టర్బ్ చేయాలి. రకరకాలుగా  చేయొచ్చన్నారు.

మొదట అరియానా టాస్క్ లో ఉంది. ఆమెని డిస్టర్బ్ చేసేందుకు సోహైల్‌ చాలా ట్రై చేశాడు. టీ కప్‌ పగుల గొట్టాడు. తన డ్రెస్‌ తీసుకొచ్చి ఆటపట్టించాడు. ఆమె  చింటు(టెడ్డీబేర్‌)ని సైతం చించేసే ప్రయత్నం చేశాడు. దాన్ని పైకి ఇసిరేశారు. ప్లేట్‌ని కొట్టారు. ఎక్స్ ప్రెషన్‌ ఇచ్చింది. మొత్తంగా తన టాస్క్ లో నాలుగు సార్లు ఎక్స్ ప్రెషన్స్  ఇచ్చింది. అయితే తన వెనకాల ఐస్‌ ని మోనాల్‌ వేసినందుకు అరియానా ఫైర్‌ అయ్యింది. ఇంతగా మనసులో పెట్టుకున్నావా? అంటూ మండిపడింది.

ఆ తర్వాత మోనాల్‌ టాస్క్ లో ఉంది. ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని అరియానా, సోహైల్‌, అభిజిత్‌ ప్రయత్నించారు. అరియానా అయితే ఏకంగా ఫైర్‌ అయ్యింది. తనకి  సంబంధించిన గతం విషయాలను మనసులో పెట్టుకున్నావా? ఇంతగా చేస్తావా, మనసులో ఇంత కోపం పెట్టుకుని ఎందుకు నాతో మాట్లాడావు, ఇన్నాళ్ళు యాక్ట్ చేశావు, నాతో  మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ నా నా రకాలుగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఆమె పది ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది.

సోహైల్‌ టాస్క్ లోకి ఎక్కాడు. అభిజిత్‌ ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అరియానా, హారిక సైతం రెచ్చిపోయి ఇబ్బంది పెట్టారు. అయితే ఈ విషయంలో అరియానా, సోహైల్‌కి  పెద్ద వివాదమే నెలకొన్నట్టు తెలుస్తుంది. ఇది రేపు ప్రసారం కానుంది.

టాస్క్ పూర్తయిన తర్వాత మోనాల్‌ ఏడ్చింది. సోఫాలో పడుకుని మోనాల్‌ బాగా ఏడ్చింది. డిఫరెంట్‌గా ఏడ్చిందని అటు మోనాల్‌, ఇటు హారిక టెన్షన్‌ పడ్డారు. ప్రతిసారి ఏదో  ఒక అలిగేషన్‌తో ఇబ్బంది పెడుతున్నారని కన్‌ఫెషన్‌ రూమ్‌కి వెళ్ళి బిగ్‌బాస్‌ ముందు మొరపెట్టుకుంది. అయితే బిగ్‌బాస్‌ స్పందించి, `ఎంతో మంది నిన్ను ఇష్టపడటం వల్లే  ఇక్కడి వరకు వచ్చావని, లక్ష్యానికి అతి దగ్గరలో ఉన్నావని, పట్టుదల కోల్పోకుండా ముందుకు దుసుకెళ్ళాలని తెలిపాడు బిగ్‌బాస్‌.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?