అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్.. విచిత్రమైన నామినేషన్లో ఆ నలుగురు
First Published Nov 23, 2020, 10:25 PM IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం నామినేషన్ ఊహించని విధంగా జరిగింది. అవినాష్, మోనాల్ మధ్య చర్చ, అఖిల్, మోనాల్ మధ్య వాగ్వాదం సరికొత్త వివాదాలను క్రియేట్ చేసింది. అంతేకాదు ఇంట్లో కొత్తబంధాలు చిగురిస్తున్నాయి.

ఆదివారం లాస్య ఎలిమినేట్ కావడంతో ఇంట్లో ఏడుగురు సభ్యులున్నాయి. సోమవారం ఎపిసోడ్ మంచి పాటతో సభ్యుల్లో జోష్ నింపింది. అనంతరం బిగ్‌బాంబ్ మేరకు అభిజిత్ కిచెన్‌లో వర్క్ చేయాల్సి వచ్చింది. దోశలు వేసే విషయంలో అభిజిత్, సోహైల్ మధ్య ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అభిజిత్ సరిగా దోశ వేయడం లేదని సోహైల్ కామెంట్ చేశాడు.

అనంతరం తమ లవ్ ఎఫైర్ గురించి అఖిల్, మోనాల్ చర్చించుకున్నారు. ఆదివారం నాగార్జున ముందు అభిజిత్, అఖిల్, మోనాల్ మధ్య జరిగిన విషయాలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అఖిల్.. మోనాల్‌కి ఓ క్లారిటీ ఇచ్చాడు. తనతో ఎక్కువ హుక్ అయిపోతున్నానని, అది నచ్చడం లేదని తెలిపారు. ఇదే అఖిల్ కొంపముంచింది. రెండున్నర నెలలుగా సాగిన వీరి రిలేషన్‌పై ప్రభావం పడినట్టయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?