బిగ్‌బాస్ ఎందుకు.. ఒక్క ఐటెమ్ సాంగ్ చాలు.. మోనాల్ షాకింగ్ రెమ్యూనరేషన్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అందంతో అలరించిన మోనాల్ గజ్జర్ ఇటీవల ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్` లో ఈ అమ్మడు అందాలు ఆరబోసింది. ఘాటెక్కించే అందాలను షేక్ చేస్తూ ఆడియెన్స్ మంత్రముగ్డుల్ని చేసింది. ఈ ఐటెమ్ సాంగ్‌కి మోనాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తెలిస్తే మాత్రం మతిపోతుందని చెప్పొచ్చు.
`బిగ్‌బాస్4`లో సందడి చేసింది మోనాల్ గజ్జర్. ఆ పాపులారిటీతో ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన `అల్లుడు అదుర్స్` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసింది.
ఇందులో `రంభ ఊర్వశి మేనక.. అందరు నాలోనే ఉన్నారని చెప్పి అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. ఓ వైపు హాట్ షోతో, మరోవైపు డాన్స్ తో కనువిందు చేసింది.
ఈ సినిమా పరాజయం చెందినా, ఇందులో మోనాల్ చేసిన ఐటెమ్ సాంగ్ మాత్రం మంచి హైప్ తీసుకొచ్చింది. హైలైట్‌గా నిలిచింది.
అయితే ఈ ఐటెమ్ సాంగ్ కోసం మోనాల్ భారీగా రెమ్యూనరేషన్ రూపంలో తీసుకుందట. ఏకంగా యాభై లక్షలు వసూలు చేసిందని టాక్.
బిగ్ బాస్ లో విన్నర్‌గా నిలిస్తే వచ్చేది యాభై లక్షలు. కానీ ఒక్క ఐటెమ్ సాంగ్ చేస్తేనే ఒక్క రోజులోనే మోనాల్ యాభై లక్షలు సంపాదించింది.
అయితే బిగ్‌బాస్ వల్ల వచ్చిన క్రేజ్‌తోనే ఈ అమ్మడికి అంత భారీ మొత్తాన్ని చెల్లించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఏదేమైనప్పటికీ మోనాల్ బిగ్‌బాస్‌తో లైఫ్ టర్న్ అయ్యినట్టే కనిపిస్తుంది.
మరోవైపు స్టార్ మాలో `డాన్స్ ప్లస్`లో ఓ జడ్జ్ గా వ్యవహరిస్తుందీ సెక్సీ భామ. అక్కడ కూడా పులిహోర కలుపుతుంది. సాకేత్‌తో చనువుగా ఉంటూ, హగ్గులిస్తూ హైలైట్ గా నిలుస్తుంది.
అంతేకాదు తనని నమ్ముకున్న అఖిల్‌కి హ్యాండిచ్చిందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి వీరి రిలేషన్ ఏ తీరం చేరుతుంది, మోనాల్ కెరీర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
దీంతోపాటు ఇప్పుడు షాప్ ఓపెనింగ్లకు మోనాల్ ఫస్ట్ ఛాయిస్‌గా మారుతుంది. అందు కోసం కూడా మోనాల్ పది లక్షల వరకు తీసుకుంటుందని టాక్. పాపులారిటీని క్యాష్ చేసుకోవడమంటే ఇదేనేమో.
ఇదిలా ఉంటే తెలుగులో `బిగ్‌బాస్`కి ముందు అడపాదడపా ఓ ఐదారు సినిమాలు చేసింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు.
కానీ బిగ్‌బాస్ ఈ అమ్మడికి విశేషమైన పాపులారిటీని తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర భాషల్లో కూడా మోనాల్ గురించి తెలిసింది.
ఈ హౌజ్‌లో అఖిల్‌తో లవ్ ఎఫైర్ సాగించి టాక్ ఆఫ్ ది హౌజ్ అయ్యింది. మొదట అభిజిత్‌తో, ఆ తర్వాత అఖిల్‌తో పులిహోర కలిపింది. హౌజ్‌లో ఆ ఇద్దరికి వివాదాలు పెట్టింది.