- Home
- Entertainment
- `అవును నేను పిచ్చికుక్కనే.. ` విజయసాయిరెడ్డిపై మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్.. దుమ్ము దుమారం
`అవును నేను పిచ్చికుక్కనే.. ` విజయసాయిరెడ్డిపై మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్.. దుమ్ము దుమారం
విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో విరుచుపడ్డారు. దిమ్మతిరిగే కౌంటర్లిచ్చారు. తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయారు బండ్ల గణేష్.

`వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో, నీ బతుకేంటో తెలుసుకో దొంగసాయి` అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డిపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఇప్పుడిది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అటు విజయసాయిరెడ్డి, ఇటు బండ్ల గణేష్‌ల మధ్య ట్వీట్ల యుద్ధం ఏపీని షేక్ చేస్తుంది. విజయసాయిరెడ్డి కులం పేరుతో తమపై ఆరోపణలు చేశారని బండ్ల గణేష్ ఆయనపై విమర్శలు గుప్పించారు.
`మీకు కులం నచ్చుకుంటే, కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. చంద్రబాబుని టీడీపీని అడ్డం పెట్టుకుని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు. నేను కమ్మవాడినే కానీ టీడీపీ కాదు. నీ పిచ్చికి, నీ కుల పిచ్చికి, నీ డబ్బు పిచ్చికి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది` అని బండ్ల ట్వీట్ చేశారు. తనకు వైఎస్సార్ అన్నా, సీఎం జగన్ అన్నా గౌరవమే అని, కానీ విజయసాయి రెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, తమ కులాన్ని అన్ని విషయాల్లో ఎందుకు లాగుతున్నావ్ అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు బండ్ల గణేష్. దీనికి కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. `ఆకులు, వక్కలు, పక్కలు ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు` అంటూ కామెంట్ చేశారు.
విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో విరుచుపడ్డారు. దిమ్మతిరిగే కౌంటర్లిచ్చారు. తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయారు బండ్ల గణేష్. ఇందులో ఆయన చెబుతూ, ఎస్ నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని, నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం, కష్టపడ్డాం. నీలా దోచుకోలేదు. దొంగ సొమ్ము దాచుకోలేదు.
ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తోంది..మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ.. అరెస్ట్ చేయిస్తారో కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నేన్ని చేస్తారో. అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలసిన గంజాయి మొక్క మీరు.. ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం. యస్.. నేను కుక్క నే గర్వం గా చెప్పుకుంటా నాకు అన్నం పెట్టి బతుకుని ఇచ్చిన విశ్వాసం గల కుక్కని నీ లాగ పిచ్చి కుక్కని గజ్జి కుక్కని మోసపు కుక్క ని కాదు దొంగ సాయి గారు` అంటూ రెచ్చిపోయారు.
అంతటితో ఆగలేదు. ఇంకా ట్వీట్లు చేస్తూ, నా మీద నేను నీ మీద నువ్వు మనం ఇద్దరం సిబిఐ ఎంక్వైరీలు వేసుకుందాం దొంగ సాయి.. ఎవరు కరెక్టో సిబిఐ నిర్ణయిస్తుంది. దమ్ముంటే రా. నువ్వు అన్నావ్ చూడు రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ వీరిలో ఎవరితోనైనా స్టేట్మెంట్ ఇప్పి నేను వారిని మోసం చేశానని, నువ్వు మోసం చేశావు అని దేశం మొత్తం కోట్ల మంది కోడై కూస్తోంది. నువ్వు మోసగాడవి అని, నీవు ముద్దాయివి అని నిను బొక్కలు వేసి జైల్లో పెట్టారు.. ఇది అబద్దమా..? నా మీద ఏ మున్నా ఏది ఉన్నా న్యాయస్థానం నాలాంటి చిన్నవాడిని ఏప్పుడు ఊరుకోదు గుర్తు పెట్టుకో..` అని తెలిపారు.
ఇంకా చెబుతూ, దొంగ సాయి ఫోన్లు పగలటం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం వ్యాపారం కాదు, తప్పు కాదు. దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం అది దొంగపని సాయి. సినిమాలు తీయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారాలు చేసుకోవడం తప్పుకాదు. జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవటం అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు గుర్తు పెట్టికో దొంగ సాయి` అంటూ విరుచుకు పడ్డారు బండ్ల గణేష్.
`చంద్రబాబు నా బాసా..? నాకు నీతి నియమం ఉంది.. నీలాగా కాదు దొంగ సాయి. నేను ఎప్పటికీ తెలుగుదేశం అభ్యర్థిని కాదు. నేను తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడుకి నాకు సంబంధం లేదు దొంగ సాయి గుర్తుపెట్టుకో..? నీకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలి దొంగసాయి.. నేను ఎప్పటికీ తెలుగుదేశం కాదు, నేను వైయస్ రాజశేఖర్రెడ్డి గారి అభిమానిని అది నిజమో కాదో కావాలంటే గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ బంధువు కెవిపి గారిని అడిగి తెలుసుకో.. దొంగసాయి.. నేను ఏపార్టీయో ఆయన చెబుతారు దొంగ సాయి` అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
`ఎవడో చెప్పిన మాటల్ని విని, ఎవరి దగ్గరో ఎంక్వైరీ చేసుకొని ట్వీట్లు పెట్టకు దొంగసాయి. ఎందుకంటే ఒకటి మనస్సాక్షి అనేది ఉంటది.. నేను తెలుగుదేశం.. నేను చంద్రబాబు మనిషనని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడబాకా.. నాకు బతుకునిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. నాకు కృతజ్ఞత ఉంటది. నేను తల్లిదండ్రులకు పుట్టా.. నీలాగా నీతిలేని బ్రతుకు నేను బతకను. రాజకీయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక నిజాయితీగా ఉంటా, ఒకరిని అభిమానిస్తా, ఒకరినే ప్రేమిస్తా, ఒకరితోనే ప్రాణం పోయేదాకా తోడుంటా నీ లాగా దొంగ వేషాలు వేయను దొంగ సాయి` అని వెల్లడించారు.
చివరగా బండ్ల గణేష్ తన మార్క్ స్పెషాలిటీని జోడించారు. `నేను చిన్నోన్ని నీ స్థాయి నాది కాదు.. నాది చిన్న స్థాయి. నేను మామూలు వాణ్ణి, నీవు పెద్దోడివి, రాష్ట్రం మొత్తం నీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. గొప్ప వ్యక్తివి, చరిత్ర సృష్టించావ్` అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే సెటైర్లు పేల్చారు బండ్ల గణేష్. దీంతో ఇప్పుడు బండ్ల గణేష్ ట్వీట్‌లో దుమారం రేపుతున్నాయి. మరి ఈ విమర్శల పర్వం ఏ రేంజ్‌కి వెళ్తాయో, ఎప్పుడు ముగింపు పలుకుతాయో చూడాలి. నెటిజన్లు మాత్రం ఈ ట్వీట్ల వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తుండటం విశేషం.