అవికాగోర్‌కి పర్‌ఫెక్ట్ ప్రేమ దొరికిందట..ప్రియుడి పరిచయం.. ఇంతకి ఎవరంటే?

First Published 12, Nov 2020, 10:19 AM

ఇటీవల నాజుగ్గా మారి అందరికి షాక్‌ ఇచ్చిన అవికా గోర్‌ జూ.రకుల్‌ అనిపించుకుంది. ఇటీవల సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక సందేశాలిస్తుంది. తన వెయిట్‌ లాస్‌ గురించి పెద్ద స్టోరీనే చెప్పింది. ఆ తర్వాత సక్సెస్‌ గురించి, ప్యాషన్‌ గురించి బోలెడు కబుర్లు చెప్పింది. తాజాగా ప్రియుడిని పరిచయం చేసి షాక్‌ ఇచ్చింది.

ఉన్నట్టుండి తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. తాను ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాదు తన ప్రియుడిని పరిచయం చేసి షాక్‌కి గురి చేసింది. మిలింద్‌ చంద్వానీ అనే ఎన్జీవో యాక్టివిస్ట్, ఎడ్యూకేషనలిస్ట్ ప్రేమిస్తున్నట్టు పేర్కొంది. ఆయనతో దిగిన ఫోటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటూ అభిమానులకు పరిచయం చేసింది. తాను పర్‌ఫెక్ట్ ప్రేమని పొందినట్టు పేర్కొంది.

ఈ సందర్భంగా అవికా స్పందిస్తూ`, `నా ప్రార్థనలకు సమాధానం లభించింది. నా లైఫ్‌లో లవ్‌ దొరికింది. మనల్ని అర్థం చేసుకుని, నమ్మి, స్ఫూర్తినింపి, మన అభివృద్ధిలో సాయం చేసి, మనల్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి మనం అర్థులం ` అని పేర్కొంది.

కానీ ఇలాంటి వ్యక్తి దొరకడం అసాధ్యమని చాలా మంది అనుకుంటారు. నాకూ ఇదంతా కలలా అనిపించింది. కానీ జరుగుతున్నది చూస్తుంటే వాస్తవంగానే ఉంది. మీ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నా. ఈ రోజు నేను ఎలాంటి అనుభూతిని పొందుతున్నానో, అదే భావన మీరూ పొందాలన ఆశిస్తున్నా` అని పేర్కొంది.

ఇంకా అవికా చెబుతూ, ఈ సందర్భంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇలాంటి అనుభూతిని ఇచ్చినందుకు. ఈ రిలేషన్‌ నా లైఫ్‌లో ఎంత కీలక పాత్ర పోషించనుంది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదు. నన్ను సంతోషంగా ఉంచేందుకు నా జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అది నాకు ఎంతో అందమైన అనుభవంలా ఉంది` అని చెప్పింది.

`ఈ ఇడియట్‌ నా హృదయాన్ని కదిలించాడని చెబుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు ధన్యవాదాలు మిలింద్‌. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నా` అని పేర్కొంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది అవికా. గోవాలో వీరిద్దరు ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇక మిలింద్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అవికాపై ప్రేమని పంచుకున్నాడు. జీవితం నిజంగా అనూహ్యమైనదని, మనం తక్కువ ఆశతో ఉన్నప్పుడే సరైన వ్యక్తులను కనుగొంటామని చెప్పాడు. అంతేకాదు తాము నిర్వహించే ఎన్జీవో ప్రాజెక్ట్ ల్లో ఆమె మునిగిపోయిందని, తమ పిల్లలను బాగా చూసుకుందని, ఈ క్రమంలో తాను ఆమె ఒక స్టార్‌ అనే విషయాన్నే మర్చిపోయానని మిలింద్‌ పేర్కొన్నాడు.

మిలింద్‌ క్యాంప్‌ డైరీస్‌ అనే పేరుతో ఎన్జీవోని నిర్వహిస్తున్నారు. దీనికి ఆయన సీఈవోగా ఉన్నారు. ఈ సంస్థ నిర్వహించే ఎన్జీవో సంస్థ కార్యక్రమంలో అవికా పాల్గొంది. చాలా రోజులు వీరిద్దరు ట్రావెల్‌ చేశారని ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డట్టు తెలుస్తుంది. `బాలికా వధు` సీరియల్‌తో పాపులర్‌ అయిన అవికా.. `ఉయ్యాలా జంపాలా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా రాణిస్తుంది. చివరగా ఆమె `రాజుగారిగది 3`లో నటించింది.