బర్త్ డే జరుపుకున్న హాట్ బ్యూటీ మలైకా..వెరైటీగా విశెష్ చెప్పిన ప్రియుడు అర్జున్
బాలీవుడ్ హాట్ హీరోయిన్, మోడల్, యోగా బ్యూటీ మలైకా అరోరా.. ఎప్పటికప్పుడు అందాలతో, యోగా ఆసనాలతో తన అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ సెక్సీ భామ శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంది.
వీడియో జాకీగా కెరీర్‌ని ప్రారంభించిన మలైకా మల్లీపుల్ రంగాల్లో రాణిస్తుంది. హీరోయిన్గా మారి హిందీ ప్రేక్షకులను మత్తెక్కించింది. ఘాటైన అందాలతో కనువిందు చేసింది.
ఇక డాన్స్లులతో మరింతగా ఆకట్టుకుంటుంది. నటిగా, స్పెషల్ సాంగ్‌లకు ఐటెమ్ భామగా మలైకా హిందీ ఆడియెన్స్ ని బాగానే మెప్పిస్తుంది.
నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్న ఈ భామ `దబాంగ్`, `దబాంగ్2`, `డాలీ కి డోలీ` చిత్రాలకు నిర్మాణంలో భాగమైంది.
టెలివిజన్‌లో డాన్స్ షోలకు వ్యాఖ్యాతగా, ఆ తర్వాత జడ్జ్ గా వ్వవహరిస్తోంది. ప్రస్తుతం `ఇండియాస్ బెస్ట్ డాన్సర్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
వ్యక్తిగత విషయాలకు వస్తే.. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని 1998లో వివాహం చేసుకుంది. 2016లో వీరిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది మలైకా.
గత కొంత కాలంగా యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తుంది. అర్జున్ కంటే 13ఏళ్ళు మలైకా పెద్దది కావడం విశేషం. వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. త్వరలో వీరిద్దరు మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని టాక్.
నేడు మలైకా పుట్టిన రోజు కావడంతో అర్జున్ ప్రత్యేకంగా విశెష్ తెలిపారు. 48వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మలైకాకు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేశాడు. మలైకాను `ఫూల్` అని పేర్కొంటూ `హ్యాపీ బర్త్ డే మై ఫూల్ మలైకా అరోరా` అని కామెంట్ చేశాడు. నైట్ డ్రెస్‌లో ఉన్న మలైకా ఫొటోను షేర్ చేశాడు. అర్జున్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.