బిగ్‌బాస్‌ షో.. కంటెస్టెంట్లకి నిజంగానే హెల్ప్ అయ్యిందా?.. ఒరిగిందేంటి?

First Published Dec 21, 2020, 6:47 PM IST

బిగ్‌బాస్‌ షో ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా పాపులర్‌ అయ్యింది. దీనితో అనేక మంది సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారిపోతారు. వారికి విశేషమైన గుర్తింపు వస్తుంది. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక వారికి ఫాలోయింగ్‌ పెరుగుతుందంటారు. మరి నిజంగానే అది సాధ్యమవుతుంది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి అవకాశాలు వస్తున్నాయా? 

బిగ్‌బాస్‌ రియాలిటీ షో మొదటి ప్రారంభమైంది హిందీలో. అది క్రమంగా సౌత్‌ భాషలకు పాకింది. తెలుగులో నాలుగేళ్ళుగా రన్‌ అవుతుంది. 2017లో మొదటగా స్టార్‌మా  ఎన్టీఆర్‌ హోస్ట్ గా ఈ రియాలిటీ షోని ప్రారంభించింది. 16 మంది పాల్గొన్న ఈ షో డెబ్బై రోజులు కొనసాగింది. మొదటి షోకి మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ టైమ్‌ తెలుగులో  ప్రసారమవుతున్న షో కాబట్టి జనాలు బాగానే చూశారు.

మొదటి సీజన్‌లో నటుడు శివబాలాజీ విన్నర్‌గా ట్రోఫీ గెలుచుకున్నారు. అందులో ప్రముఖంగా రాణించే నటులే ఎక్కువగా పాల్గొన్నారు. అయితే ఆ షో తర్వాత ఎవరూ పెద్దగా  రాణించలేదు. బిగ్‌బాస్‌ వల్ల కొత్తగా ఆఫర్స్ దక్కించుకున్న వాళ్లుగాని, ఈ షో తర్వాత స్టార్‌ లుగా ఎదిగిపోయిన వాళ్ళు గానీ ఎవరూ లేరు. శివబాలాజీ నుంచి, హరితేజ,  నవదీప్‌, సంపూర్నేష్‌బాబు, ముమైత్‌ ఖాన్‌, ధన్‌రాజ్‌, ప్రిన్స్, మధుప్రియ, అర్చన వంటి వారంతా ఇంకా కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నారు. ఇందులో చాలా మంది  ఇప్పుడు కనిపించకుండా పోయారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నాని హోస్ట్ గా ప్రారంభమైంది. ఈ షోలో 18 మంది పాల్గొన్నారు. గీతామాధురి, అమిత్‌ తివారి, తనీష్‌, శ్యామల, తేజస్విని, కౌశల్‌, నందిని రాయ్‌, పూజా  రామచంద్రన్‌ వంటి వారు పాల్గొన్నారు. వీరిలో నటులు, సింగర్స్, మోడల్స్ ఉన్నారు.

రెండో సీజన్‌లో కౌశల్‌ విన్‌ అయ్యారు. అనంతరం కౌశల్‌కి సంబంధించి పెద్ద వివాదం చుట్టుముట్టింది. దీంతో కనిపించకుండా పోయాడు కౌశల్‌. అంతకు ముందుకు సీరియల్స్  లో రాణించేవారు. ఆ తర్వాత ఆయనకు ఆ సీరియల్స్ విషయంలో కూడా స్ట్రగుల్‌ అవ్వాల్సిన పరిస్థితి.

గీతా మాధురి అంతకు ముందున్న జోష్‌ ప్రజెంట్‌ కనిపించడం లేదు. తేజస్విని మదివాడా ఇంకా కష్టపడుతూనే ఉంది. చివరికి గ్లామర్‌ని నమ్ముకోవాల్సి వస్తుంది. హీరో తనీష్‌  సైతం సినిమా కష్టాలు పడుతూనే ఉన్నాడు. వీరిలో ఎవరూ బిగ్‌బాస్‌ తర్వాత మంచి అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు లేరు. లైఫ్‌ టర్నింగ్‌ మూవ్‌మెంట్స్ అనేది లేదు.

మూడో సీజన్‌ నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైంది. 17 మందికంటెస్టెంట్స్ పాల్గొనగా, ఇది కూడా 105 రోజులు రన్‌ అయ్యింది. ఈ సీజన్‌కి కాస్త మంచి క్రేజ్‌ వచ్చింది.  వ్యూవర్స్ పెరిగారు. ఇందులో యాంకర్‌ శివజ్యోతి, హిమజ, రాహుల్‌ సిప్లిగంజ్‌, పునర్నవి, వరుణ్‌ సందేశ్, కత్తి మహేష్‌ వంటి వారు పాల్గొన్నారు.

మూడో సీజన్‌లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌గా నిలిచారు. అయినా కొత్తగా తన కెరీర్‌ పరంగా కొత్త ఒరిగిందేం లేదు. పాపులర్‌ అయిన పునర్నవి కెరీర్‌ కూడా ఇంకా  కష్టాల సుడిగుండంలోనే ఉంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయినా తర్వాత తుస్సుమంది. సినిమా అవకాశాలుగానీ, ఇతర కెరీర్‌ పరంగా ఛాన్స్ లుగానీ ఈ  సీజన్‌లోని కంటెస్టెంట్లు దక్కించుకోలేదు. దీంతో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు హెల్ప్ కాలేకపోయింది.

ప్రస్తుతం ఆదివారంతో నాల్గో సీజన్‌ పూర్తయ్యింది. నాగార్జున హోస్ట్ గా రన్‌ అయిన ఈ షో 105 రోజులు విజయవంతంగా రన్‌ అయ్యింది. ఇందులో మొత్తం 19 మంది  పాల్గొన్నారు. నాల్గో సీజన్‌లో కొరియోగ్రాఫర్‌ అమ్మా రాజశేఖర్‌, హీరో అభిజిత్‌, హీరోయిన్‌ మోనాల్‌, నటుడు నోయల్‌, కమెడీయన్‌ అవినాష్‌, యాంకర్‌ లాస్య, నటి కరాటే  కళ్యాణి, దర్శకుడు సాయి కిరణ్‌ వంటి వారు పాల్గొన్నారు.

ఆదివారంతో ముగిసిన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అందరు ఊహించినట్టే అభిజిత్‌ విన్నర్‌గా నిలిచారు. అఖిల్‌ రన్నరప్‌గా, సోహైల్‌ ముందుగానే 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని  జాక్‌పాట్‌ కొట్టేశాడు. అయితే ఈ గ్రాండ్‌ ఫినాలెలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన సభ్యులతో మాట్లాడారు. వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇందులో సోహైల్‌కి మంచి పేరు, ఆదరణ దక్కింది. తాను సినిమా తీస్తానని, సపోర్ట్ చేయాలని సోహైల్‌ కోరగా, చిరంజీవి ఓకే అన్నారు. అతని సినిమా ఈవెంట్‌ని తానే  నిర్వహిస్తానని చెప్పాడు. ఇక హౌజ్‌లో దర్శకుడు అనిల్‌ రావిపూడి సైతం ఛాన్స్ ఇస్తా అన్నాడు. మరోవైపు దివికి ఛాన్స్‌ ఇస్తా అన్నారు చిరంజీవి. తాను నటించే `వేదాలం`రీమేక్‌లో ఓ పాటలో తనతో డాన్స్ చేసే అవకాశం ఇస్తానని వేదికగా చెప్పారు. అరియానాకి కూడా మంచి ఫ్యూచర్‌ ఉందని, పెద్ద హీరోయిన్‌గా రాణిస్తుందన్నారు. మోనాల్‌ని కూడా అన్ని భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతావని, ఎదగాలని, బయట చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాడు. అభిజిత్‌, అఖిల్‌లు, సోహైల్‌ తమలాగా పెద్ద హీరోలు కావాలని చెప్పారు. దీంతో ఇక వీరి లైఫ్‌ టర్న్ అయిపోతుంది. క్రేజీ సెలబ్రిటీలు కాబోతున్నారు. కెరీర్‌లో బిగ్‌ టర్నింగ్‌ పాయింగ్‌ బిగ్‌బాస్‌ కాబోతుందంటున్నారు.

మరి గత లెక్కల ప్రకారం నిజంగానే వీరి జీవితాలు మారిపోతాయా? అన్నది మరింత ప్రశ్నార్థకంగా మారింది. గత సీజన్‌లో పాల్గొన్న వారెవరూ పెద్ద అవకాశాలు  దక్కించుకోలేదు. ఒకటి రెండు దక్కించుకునా, ఆ గుర్తింపుని పొందలేదు. వాటిలానే నాల్గో సీజన్‌ కంటెస్టెంట్ల పరిస్థితి ఉంటుందా? కేవలం ఈ బిగ్‌బాస్‌ సీజన్‌ ఇప్పుడే  ముగిసింది కాబట్టి ఈ రెండు మూడు రోజులు ఉండే బజ్‌ వల్లే అలా అనిపిస్తుందా? లేక నిజంగానే వారికి అవకాశాలు వచ్చి కెరీర్‌ టర్న్ అవుతుందా? అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా  మారింది. మరి ఏం జరుగుతుందనేది మున్ముందు చూడాలి.

ఇదిలా ఉంటే ఈ షో వల్ల దీని నిర్వహకులకు, ముఖ్యంగా స్టార్‌మాకే పెద్ద ప్రయోజనంలా కనిపిస్తుంది. ఈ పాపులారిటీ షో కావడంతో అనేక ప్రకటనలు యాడ్స్ రూపంలో కోట్లు రూపంలో లాభాలు అర్జిస్తుంది. కంటెస్టెంట్లకు, హౌజ్‌ నిర్వహణకు పోనూ కోట్లలో స్టార్‌ మా కొట్టేసిందనే ప్రచారం జరుగుతుంది. అంతిమంగా బిగ్‌బాస్‌ వల్ల టీవీ ఛానెల్‌కి తప్ప మరెవ్వ ప్రయోజనం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?