మెడలో తాళిబొట్టుతో షాక్ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్, పెళ్ళి చేసుకుందా..?
అవ్వడానకి మలయాళ అమ్మాయే అయినా.. అచ్చ తెలుగు అల్లరిపిల్లలా కనిపిస్తుంది అనుపమా పరమేశ్వరన్. చేసింది తక్కువ సినిమాలు అయినా తెలుగు వారి మనసుల్లో నిలిచిపోయింది. ఇక ఈక్రమంలో తాజాగా ఆమె ఆడియన్స్ ను షాక్ ఇచ్చింది.

వరుస సినిమాలు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న మలబారు అందం అనుపమా పరమేశ్వరన్. అవ్వడానికి ఈమె మలయాళ కుట్టి అయినా.. తెలుగు ప్రజలు ఆమెను తెలుగమ్మాయిగానే చూస్తారు. అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మలయాళం కంటే కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది అనుపమ. ఇక ఇప్పుడు తెలుగులో పాటు.. తమిళ, మలయాళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది.
మలయాళం, తమిళ సినిమాల బిజీ బిజీగా ఉంది అనుపమా. ఆమధ్య అసలు ఇండస్ట్రీలో కనినిపించకుండాపోయింది. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న తరువాత తిరిగి యాక్టీవ్ అయ్యింది బ్యూటీ. గతంలో చాలా పద్దతిగా సినిమాలు చేసిన అనుపమా.. ఇప్పుడు కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. త్వరలో తెలుగులో టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ, అప్పుడప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తుంది.
అవ్వడానకి మలయాళ అమ్మాయే అయినా.. అచ్చ తెలుగు అల్లరిపిల్లలా కనిపిస్తుంది అనుపమా పరమేశ్వరన్. చేసింది తక్కువ సినిమాలు అయినా తెలుగు వారి మనసుల్లో నిలిచిపోయింది. ఇక ఈక్రమంలో తాజాగా ఆమె ఆడియన్స్ ను షాక్ ఇచ్చింది.
తాజాగా అనుపమ పెళ్లి అయినట్టు పెళ్లి కూతురి గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది. మెడలో తాళిబొట్టు, పట్టుచీర, నుదురుతో పాటు, పాపిట తిలకంతో పెళ్ళైన మహిళలా కినిపంచింది. ఈ పోటోలను తన ఇన్ స్టాలో శేర్ చేసింది అనుపమా. దాంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ఆమెకు పెళ్ళైయ్యిందేమో అని డౌట్ పడ్డారు.
ఆమె తాళిబొట్టు పట్టుకుని చూపించేసరికి సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏంటి తాళితో ఫొటోలు పెట్టావు అని కొంత మంది అడుగుతుంటే, మరి కొంతమంది మాత్రం చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా అని అంటున్నారు.
అయితే ఈ ఫొటోలు ఏదైనా తమిళ సినిమా షూటింగ్ కు సబంధించినవేమో అని అంటున్నారు. ఎందుకంటే ఆమె చూపించిన తాళి.. తమిళ సాంప్రదాయం ప్రకారం ఉంది. అనుపమ ప్రస్తుతం తమిళం లో జయం రవి సరసన సైరెన్ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలో రిలీజ్ కు రెడీగా ఉన్న ఈమూవీ నుంచి తాజాగా ‘నేత్రు వరై..’ అని సాగే పాట రిలీజయ్యింది.
ఈ పాటలో జయం రవి, అనుపమ క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. దీంతో అనుపమ ఆ షూటింగ్ జరిగినప్పటి ఫోటోలని ఇప్పుడు సాంగ్ ప్రమోషన్ కోసం పోస్ట్ చేసింది. అయితే అనుపమ తాళి కట్టుకున్న ఫొటోలు చూసి మొదట షాక్ అవుతున్నారు అభిమానులు. పెళ్లి కూతురి గెటప్ లో క్యూట్ గా ఉన్న అనుపమను చూసి ముచ్చట పడుతున్నారు.