షర్ట్ పైకి ముడేసి, నడుము చూపిస్తూ అనుపమా పరమేశ్వరన్ అందాల కవ్వింత.. తగ్గేదెలే అంటోందిగా!
హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకుంది అనుపమా పరమేశ్వరన్. రానురాను తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటోంది. హోమ్లీ అనే పదానికి హద్దులు చెరిపేస్తుంది. బోల్డ్ ఫోటోలతో నెట్టింట దుమారం రేపుతుంది. లేటెస్ట్ గా పంచుకున్న గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్లామర్‌కి దూరంగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అనుపమా పరమేశ్వరన్ ఇటీవల తన బార్డర్స్ ని తానే క్రాస్ చేస్తున్నట్టుంది. తాజాగా ఈ అందాల భామ ఓ హాట్ ఫోటోని పంచుకుంది.
ఇందులో ఆమె వైట్ షర్ట్ ధరించింది. బ్లూ లెహంగాలో మెరిసింది. అయితే షర్ట్ ని పైకెత్తి ముడేసి పోజులివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కూడా ఇలానే షర్ట్ పైకి ముడేసి నడుముందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది అనుపమా.
ఈ మధ్య వరుసగా ఇలా షర్ట్ ముడేసిన ఫోటోలను, బోల్డ్ లుక్‌లను పంచుకుంటుంది. నడుమందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనుపమా ఇలా తన బార్డర్స్ ని బ్రేక్ చేయడం పట్ల ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గత కొన్ని రోజులుగా అనుపమా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. స్కిన్ షోకి తెరలేపుతూ తాను హోమ్లీ బ్యూటీని మాత్రమే కాదు, తనలో మరో యాంగిల్ కూడా ఉంది, అందాల ఆరబోతకి తాను సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది.
క్యూట్ లుక్స్ తో `ప్రేమమ్`తో అందరి హృదయాలను గెలుచుకుంది అనుపమా పరమేశ్వరన్. టాలీవుడ్ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గానూ మారిపోయిందీ అందాల సోయగం. `అ.. ఆ` చిత్రంలో మాస్ రోల్లో అదరగొట్టింది. `శతమానం భవతి` చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది.
ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ పరాజయం చెందుతుండగా, `రాక్షసుడు` కాస్త ఊరటనిచ్చింది. కానీ తనకు ఆశించిన పేరు రాలేకపోయింది. దీంతో అనుపమా ఇక కష్టమే అనుకున్న టైమ్‌లో కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతుంది.
ప్రస్తుతం అనుపమా నిఖిల్‌తో `18పేజెస్` చిత్రంలో నటిస్తుంది. `కుమారి 21ఎఫ్` ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ లో తెరకెక్కుతున్న చిత్రమిది.
దీంతోపాటు నిఖిల్‌తో `కార్తికేయ 2` కూడా చేస్తుంది అనుపమా. ఇటీవలే నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి ప్రకటించారు. ఇదే కాకుండా `రౌడీబాయ్స్` అనే మరో సినిమాలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది అనుపమా పరమేశ్వరన్.