- Home
- Entertainment
- Intinti Gruhalashmi: అంకిత కోసం తులసి లక్ష్మణ రేఖ.. దౌర్జన్యం చేస్తే ఇక్కడ జరిగే కురుక్షేత్రం అంటూ !
Intinti Gruhalashmi: అంకిత కోసం తులసి లక్ష్మణ రేఖ.. దౌర్జన్యం చేస్తే ఇక్కడ జరిగే కురుక్షేత్రం అంటూ !
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 20వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత తులసి ఇంట్లోకి అడుగుపెడుతుంది. అది చుసిన దివ్య, అనసూయ వాళ్ళు అంకితను చూసి షాక్ అయ్యి తులసిని పిలుస్తారు. అంకితను చుసిన తులసి షాక్ అవుతుంది. మీ పర్మిషన్ తీసుకోకుండా నేను మన ఇంట్లోకి అడుగుపెట్టలేను ఆంటీ మీరు చెప్పండి అని అంటే నేను ఆరోజు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని తులసి అంటుంది.
ఇదే స్థానంలో మీ కొడుకు ఉంటే మీరు ఇలానే చేస్తారా అని అంకిత అంటే తులసి బాధతో ఆలోచిస్తుంది. ఆరోజు మీరు చెప్పినదానికే నేను అభిని మా ఇంటికి తీసుకెళ్ళాను అని అంటుంది. ఆతర్వాత పరంధామయ్య.. అసలు ఏమైంది అమ్మ.. అభి ఎక్కడకి వెళ్ళాడు.. నువ్వు ఒక్కటే ఇలా ఎందుకు వచ్చావ్ అని అంటే.. ఆ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు.. బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది.
అది విన్న తులసి కన్నీళ్లు పెడుతుంది. మీ కొడుకు కూడా అలానే చేస్తున్నాడు అని అంకిత కన్నీళ్లు పెడుతుంది. అందుకే నేను అన్ని వదులుకొని కాదని ఇక్కడకు నా వాళ్ళ దగ్గరకు వచ్చేసాను అని అంటుంది. అప్పుడే తులసి మాట్లాడుతూ.. నువ్వు నీ వాళ్లని మాత్రమే కాదు నీ భర్తను కూడా వదిలేసి వచ్చావ్ అని అంటుంది. నీ కొడుకు స్వార్థం చూసుకున్నాడు.. నేను నా ఇంటికి వచ్చాను అంటుంది.
అప్పుడే తులసి మాట్లాడుతూ.. నువ్వు మాత్రమే రావు అంకిత నీ కోసం ఎంతోమంది వచ్చి జైల్లో పెట్టించాలి అని అనుకుంటారు అని తులసి అంటుంది. నువ్వు ఏంటి భయపడుతున్నావు అని అత్తమామలు ప్రశ్నిస్తే నేను మీ అబ్బాయిని వదులుకోలేదు.. ఎన్నో రకాలుగా కాపురం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేశాను అన్ని రకాలుగా ఓడిపోయిన తర్వాతే నేను నందుకు విడాకులు ఇచ్చాను అని తులసి చెప్తుంది.
ఆ మాటలు విన్న అంకిత మీరు నన్ను ఈ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వకపోవడం అది మీ నిర్ణయం.. కానీ నేను నా పుట్టింటికి వెళ్తాను అని మీరు అనుకోకండి.. ఎక్కడైనా బయట ఉంటాను అని చెప్తుంది. అప్పుడు ఇంట్లోవాళ్ళు అందరూ బ్రతిమిలాడినా తులసి ఆలోచిస్తుండటంతో అంకిత వెళ్ళిపోతుంది. అప్పుడు అనసూయ వచ్చి కోడలిని కాపాడుకోవడం నీ బాధ్యత అంటుంది. ఆతర్వాత అంకితను దివ్య లోపలికి తీసుకెళ్తుంది.
ఇక మరోవైపు నందును ఇంటి ఓనర్ వచ్చి అద్దె డబ్బులు ఇవ్వాలంటూ పట్టు పడుతుంటాడు. అప్పుడే లాస్య వచ్చి నందు కొన్ని వాటర్ తెచ్చి ఇవ్వు అంటే వెళ్లి తెచ్చుకో అని అంటాడు. ఇంటి ఓనర్ వచ్చి రెంట్ అడిగాడు అని చిరాకు పడుతూ అభికి ఫోన్ చేస్తాడు. అప్పుడు అభి జరిగిన విషయం చెప్పగా నందు, లాస్య ఒక్కసారిగా షాక్ అవుతారు.. గాయిత్రి కూడా మాట్లాడితే ఇంటి మీద పడి తాడో పీడో తేల్చుకుందాం అంటాడు.
అంకితను వెనక్కి తెచ్చుకుందాం అని గాయిత్రి అంటే నేను మాత్రం ఆ గడప తొక్కను అంటూ అభి ఆగిపోతాడు. మరోవైపు అంకిత అభి గురించి గాయిత్రి గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెడుతుంటుంది. నేను నా భర్త ఇద్దరు కలిసే అవకాశం లేదా అని అంకిత బాధ పడుతూ ఉంటె దివ్య వాళ్ళు చూస్తారు.. ఇక మరో ఎపిసోడ్ లో అంకితను లాక్కు వెళ్ళడానికి వస్తే తులసి లక్ష్మణ రేఖ గీసి ఇష్టం లేకుండా అంకితను లాక్కెళ్ళడానికి వస్తే ఇక్కడ జరిగేది కురుక్షేత్రమే అంటూ షాక్ ఇస్తుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.