సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలో సుమ రచ్చ.. వైరల్ అవుతున్న డాన్స్ వీడియో!
టాలీవుడ్ లో ఈ మధ్య జరిగిన వివాహాలలో సింగర్ సునీత వివాహం హాట్ టాపిక్ అయ్యింది. 42ఏళ్ల సునీత రెండో వివాహం చేసుకోవడం ఒకింత కొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహం జనవరి 9న ఘనంగా జరిగింది.
సునీత వివాహంపై సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ వినిపించాయి. కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగిటివ్ గా స్పందించడం జరిగింది. మెజారీ నెటిజెన్స్ సునీతకు మద్దతుగా నిలవడం విశేషం.
ఎవరు ఏమనుకున్నా సునీత ఆనందంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. నిశ్చితార్ధ కార్యక్రమం సింపుల్ గా ముగించిన రామ్-సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పాటు పెళ్లి ఘనంగా చేసుకున్నారు.
రామ్ సునీతల పెళ్ళికి బుల్లితెర, వెండితెర ప్రముఖులతో పాటు రాజకీయ వేత్తలు హాజరయ్యారు.
సునీత బంధువులు, స్నేహితులు ఆ వీడియోలో సందడి చేయగా విశేషత సంతరించుకుంది. సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలలో స్టార్ యాంకర్ సుమ పాల్గొన్నారు. సునీత పెళ్లి వేడుకలలో సుమ డాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సునీత యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన తన ప్రీ వెడ్డింగ్ వీడియోలో సుమ ఎనర్జిటిక్ గా కనిపించారు. ఆమె సునీత మరియు బంధువులతో కలిసి డాన్స్ చేశారు.
ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉన్నారు. కూతురు ఆద్యతో పాటు ఆమె సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.
ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉన్నారు. కూతురు ఆద్యతో పాటు ఆమె సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.
ఇద్దరు పిల్లలతో సునీత వేడుకను ఆస్వాదిస్తున్న క్షణాలను ఆ వీడియోలో మనం చూడవచ్చు.
మొత్తంగా సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు.