- Home
- Entertainment
- `బిగ్ బాస్` షోకి రష్మి.. క్లారిటీ ఇచ్చిన హాట్ యాంకర్.. బ్యాక్ షోతో ఒకేసారి అన్ని పండగలు తీసుకొచ్చిందిగా!
`బిగ్ బాస్` షోకి రష్మి.. క్లారిటీ ఇచ్చిన హాట్ యాంకర్.. బ్యాక్ షోతో ఒకేసారి అన్ని పండగలు తీసుకొచ్చిందిగా!
హాట్ యాంకర్, జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ గ్లామర్ ట్రీట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఆమె మల్టీఫుల్ గ్లామర్ ఫోటోలను పంచుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో అందాల విందు చేస్తుంది.

`జబర్దస్త్` యాంకర్ రష్మి (Anchor Rashmi) గా అభిమానులకు అన్ని పండగలు ఒకేసారి తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో ఆమె చేసినఫోటో షూట్ పిక్స్ ని ఒకేసారి కలిపి పంచుకుంది. బ్లాక్ అండ్ వైట్ చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో మెయిన్‌గా Rashmi Gautam బ్యాక్ అందాలను చూపించడం విశేషం. చీరలో 70ఎంఎం లాంటి తెరని చూపించింది. వీపు అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. పిచ్చెక్కించే బ్యాక్ అందంతో నెటిజన్లకి హాట్ ట్రీట్ ఇచ్చింది.
దీనికితోడు పలు నయా ట్రెండీ వేర్ పిక్స్ ని సైతం ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసింది. ఈ ఫోటోలకు విశేష ఆదరణ దక్కుతున్నాయి. లక్షల మంది నెటిజన్లు తిలకించారు. తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ని చాటి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే చాలా ఫోటో షూట్లకి సంబంధించిన ఫోటోలను ఒకేసారి పంచుకోవడంతో నెటిజన్లు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. బెస్ట్ అందాలను వీక్షిస్తూ పండగ చేసుకుంటున్నారు. అన్ని అందాల ఫెస్టివల్స్ ఒకేసారి వచ్చినట్టుగా రష్మి అందాలు ఉండటంతో వారి సంబరాల్లో మునిగిపోతున్నారని చెప్పొచ్చు.
యాంకర్ రష్మి గ్లామర్ షోలో ముందే ఉంటుంది. ప్రతి వారం జబర్దస్త్ షో కోసం ఆమె గ్లామర్ షో చేస్తుంటుంది. `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా ఆమెనే హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ గతంలో మాదిరిగా ఆమె ఫోటో షూట్ పిక్స్ ని అభిమానులతో పంచుకోవడం లేదు. చాలా అరుదుగానే షేర్ చేస్తుంది. ఫ్యాన్స్ ని కాస్త డిజప్పాయింట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయంపై క్లారిటీ ఇచ్చింది రష్మి గౌతమ్. ఆమె వచ్చే బిగ్ బాస్ 7వ సీజన్ లో రష్మి కంటెస్టెంట్ గా పాల్గొంటుందనే వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై రష్మి స్పందించింది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లో దీనిపై క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నట్టు రూమర్స్ వినిపించాయి. అందులో నిజం లేదు. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదు అని పేర్కొంది.
నిజానికి రష్మికి బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఓకే చెప్పాలిగానీ చాలా టీవీ షోస్, సినిమా ఛాన్స్ లు కూడా వస్తాయి. కానీ చాలా సెలక్టీవ్‌గా వెళ్తుందీ హాట్ యాంకర్. ప్రస్తుతం జబర్దస్త్ తోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్‌గా చేస్తుంది.
మరోవైపు ఇటీవల ఆమె `బొమ్మ బ్లాక్‌బస్టర్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బాగానే మెప్పించింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేయబోతుందట. `గాలోడు` దర్శకుడు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.