అనసూయను అప్పట్లో ఆదుకున్నాను అంటున్న ఫేడ్ అవుట్ యాంకర్!
First Published Jan 9, 2021, 3:08 PM IST
ఒకప్పట్లో యాంకర్స్ అంటే సుమ, ఝాన్సీ మరియు ఉదయభానునే. వీరి తరువాత జనరేషన్ లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు భార్గవి. అందమైన రూపంతో పాటు ఆకట్టుకొనే మాటతీరు కలిగిన భార్గవి సక్సెస్ ఫుల్ యాంకర్ గా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా ఉన్నారు. అప్పట్లో సుమ, ఝాన్సీ మరియు ఉదయభాను మధ్య తీవ్ర పోటీ నడుస్తూ ఉండేది.

స్టార్ యాంకర్స్ గా వాళ్ళు వెలిగిపోతున్న రోజులలో భార్గవి సైతం కొన్ని ఆఫర్స్ దక్కించుకొని సత్తా చాటారు. కాగా తాజా ఇంటర్వ్యూలో యాంకరింగ్ రంగంలో అప్పటి, ఇప్పటి పరిస్థితులను తలచుకుంటూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యాంకర్ అనసూయ గురించి కొన్ని విషయాలు ఆమె తెలియజేశారు.

అప్పట్లో భార్గవి చాలా బిజీగా ఉండేవారట. లెక్కకు మించి ఆఫర్స్, ఈవెంట్స్ వస్తున్న నేపథ్యంలో తనకు ఖాళీ లేకపోయితే అనసూయకు ఫోన్ చేసి చెప్పేవారట. తనకు వచ్చే అవకాశాలను అనసూయకు పలుమార్లు ఫోన్ చేసి అప్పగించినట్లు భార్గవి తెలిపారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?