యాంకర్ అనసూయ మరో ఐటెమ్ సాంగ్.. ఈసారి దానికి మించీ..తట్టుకోవడం కష్టమేనట ?
సెక్సీ యాంకర్ అనసూయ మరో ఐటెమ్ సాంగ్ చేయబోతుందట. ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు మరో ఐటెమ్ సాంగ్‌కి రెడీ అవుతుంది. శర్వానంద్‌తో కలిసి ఈ బ్యూటీ నడుము షేక్ చేయబోతుందని టాక్. అయితే ఈ సారి ఈ అమ్మడిని చూసి తట్టుకోవడం కష్టమే అంటున్నారు.
అనసూయ యాంకర్‌గా ఎంత పాపులరో తెలిసిందే. `జబర్దస్త్` షోతో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇందులో అందాలు ఆరబోస్తూ, క్యూట్, హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతుంది.
టీవీ షోస్‌లో ఈ అమ్మడికి వచ్చిన క్రేజ్‌ని సొంతం చేసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కార్తికేయ నటించిన `చావు కబురు చల్లగా` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి ఓ ఊపుఊపింది. దీని కోసం దాదాపు ఇరవై లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట.
ఇప్పుడు మరో ఐటెమ్ సాంగ్‌లో నటించబోతుంది. శర్వానంద్‌తో ఈ అమ్మడు నడుముని షేక్ చేయబోతుందట. `మహాసముద్రం`లో అనసూయ ఐటెమ్ సాంగ్ చేయబోతుందని టాక్.
శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా అజయ్ భూపతి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో అనసూయతో ఐటెమ్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారు. అయితే గతంలో ఆమె చేసిన ఐటెమ్ సాంగ్‌లకు మించిఉంటుందని, అనసూయని మరింత సెక్సీగా చూపించబోతున్నారని టాక్.
దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి దీనికి అనసూయ ఎంత డిమాండ్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలోనూ అనసూయతో ఓ ఐటెమ్‌సాంగ్ చేయించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` షోతో పాటు నటిగా సినిమాల్లో బిజీగా ఉంది. `ఆచార్య`, `పుష్ప`, `ఖిలాడి`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో, అలాగే మలయాళంలో మమ్ముట్టి చిత్రంలో నటించే అరుదైన అవకాశాలు దక్కించుకుంది అనసూయ.
ఇక హాట్ అందాల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తున్న అనసూయ ప్రస్తుతం ఇటలీలో ఎంజాయ్ చేస్తుంది.