బికినీ వేసి భీబత్సం..విజయ్ దేవరకొండ హీరోయిన్
విజయ్ దేవరకొండ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఫైటర్' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది అనన్యా పాండే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని అమాంతం పెంచేసే పోగ్రాం పెట్టుకుంది అనన్య. ఆమె ఈ సినిమాకు ముందు తెలుగు వాళ్లకు తెలియదు. కానీ ఈ సినిమా ప్రకటన వచ్చాక ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్ పై లోడ్ పెరిగిపోయింది. ఫ్యాన్ పాలోయింగ్ పెరిగింది. దాంతో వాళ్లను మరింతగా ఆకట్టుకోవటానికి రకరకాల హాట్ విన్యాసాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో మంచి గుర్తింపు సాధించుకున్న నటి అనన్య పాండే. తెలుగులోనూ తనదైన ముద్ర వేయించుకోవాలని, సినీ రిలీజ్ కు ముందే ప్రయత్నాలు మొదలెట్టిందీ పాప. అందులో భాగంగా వదిలిన తాజా బికినీ ఫొటోలపై ఓ లుక్కేయండి మరి.
బాలీవుడ్ విలక్షణ నటుడు చెంకీ పాండే తనయ అయిన అనన్య సినీ పరిశ్రమలో దూసుకెళ్తున్నది. ఈమె అందచందాలే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారుతున్నాయి
ఈ డ్రెస్ తో ఉన్నట్టుండి చలికాలాన్ని మరిపిస్తూ అగ్గి రాజేస్తోంది వరసగా ఫోటో ట్రీట్ తో తన అభిమానులకి కనువిందు చేస్తోందీ బ్యూటీ.
బికినీ బీచ్ సెలబ్రేషన్ నుంచి మచ్చు తునక ఇది. చక్కనమ్మకి ఏం వేసినా అందంగానే ఉంటాయి మరి.అని మెచ్చేసుకుంటున్నారు ఫ్యాన్స్
అనన్య తన దుస్తుల ఎంపిక టూమచ్ హాట్ అనే చెప్పాలి. ఓవరాల్ గా నేచురల్ లుక్ ఎంచుకున్నా..ఆ చిలిపి నవ్వుతోనే గుండెల్ని లాగేస్తుంది. అంటోంది మీడియా
గత ఏడాది ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైంది అనన్య. ప్రముఖ నటుడు చంకీ పాండే కూతురామె.
క్యూట్‌గా ఉంటుంది. చక్కగా నటిస్తుంది. కష్టపడే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ప్రొఫెషన్ అంటే బోలెడంత ప్రేమ.
నిద్ర లేకుండా షూటింగ్ చేయమన్నా చేస్తుంది. ఈ మధ్య అలానే చేసింది. ప్రస్తుతం ‘ఖాలీ పీలీ’ అనే సినిమాలో నటిస్తోందీ బ్యూటీ. ఈ సినిమా కోసం నాన్‌స్టాప్‌గా 23 గంటలు షూటింగ్ చేసింది అనన్య.
ఆ సినిమా యూనిట్ అంతా ‘అనన్య.. అసామాన్య’ అంటున్నారు. పని విషయంలో ఇంత శ్రద్ధగా ఉంటున్న అనన్య కచ్చితంగా మంచి స్థాయికి ఎదుగుతుందని కూడా అభినందిస్తున్నారు.
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్’.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండేను ‘ఫైటర్’కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. తొలుత జాన్వి కపూర్‌తో చిత్ర బృందం చర్చలు జరిపినప్పటికీ కుదరలేదు. దీంతో చివరికి అనన్య పాండేను ఫైనల్ చేశారు.
‘సాహో’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన చుంకీ పాండే కూతురే అనన్య పాండే అన్న విషయం తెలిసిందే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫలితం తీవ్రంగా నిరాశపరచడంతో ‘ఫైటర్’పైనే విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు.
‘ఇస్మార్ శంకర్’సూపర్ డూపర్ హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన పూరి.. ఇదే జోష్‌లో ‘ఫైటర్’తోనూ మరో భారీ సక్సెస్ కొట్టాలని పూరి అండ్ గ్యాంగ్ భావిస్తోందట. అంతేకాకుండా
పూరి జగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండగా.. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది.
‘‘ఈ చిత్రంలో నా క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్లానే ఉంటుంది. అమ్మాయిలందరూ ఈ సినిమాలోని నా పాత్రకు కనెక్ట్ అవుతారు’’ అన్నారు అనన్యా పాండే.
ఈ సినిమా ఒప్పుకునేవరకూ ఈ బ్యూటీకి తెలుగు రాదు. ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు వచ్చట.
ప్రతి రోజూ ఈ చిత్రం షూటింగ్లో కొన్ని తెలుగు పదాలు నేర్చుకోవాలని నా అంతట నేను ఒక రూల్ పెట్టుకున్నాను. అలాగే నేర్చుకుంటున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను
తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషలో డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంది. మరి చూడాలి’’ అన్నారు.
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించనున్నారు విజయ్. ఇందుకోసం విజయ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ మధ్యన ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ ముంబైలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.
ముంబైలో సినిమా షూటింగ్‌లు మొదలుకావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందట. దీంతో మిగిలిన షూట్‌ను హైదరాబాద్‌లోనే ముంబై సెట్ వేసి పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట పూరి అండ్ టీమ్.
చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.అందుకే దర్శకుడు పూరి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుుకుంటన్నారు
. చార్మీ కౌర్, కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పునఃప్రారంభం కానుంది.
ఫైటర్ నా తరహా కమర్షియల్ సినిమాగా తయారవుతోంది. మామూలుగా మనం చూసే, చూస్తూ పెరిగిన రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు, కమర్షియల్ జానర్లోకి వచ్చే ఇలాంటి సినిమానే చెయ్యాలనుకున్నాను.
కమర్షియల్ సెన్సిబిలిటీస్‌కు పేరు పొందిన పూరి జగన్నాథ్‌గారు డైరెక్టర్ కావడం వల్ల ఈ సినిమాకి మరింత వాణిజ్య మద్దతు లభించింది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
ఈ సినిమాలో ఫైటర్ రోల్ చేస్తున్నాను. ఎవరినైనా కొట్టగల ఫైటర్‌లా కనిపించాలి. అందుకే ఎనిమిది నెలలుగా నేను వర్కవుట్స్ చేస్తున్నాను.
ఈ మధ్య నేను మోటివేషన్ కోల్పోయాను. కానీ తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకొని నా¯Œ స్టాప్‌గా వర్కవుట్ చేస్తున్నాను. పూరి జగన్నాథ్‌గారు నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయన సినిమాల్లో ‘పోకిరి’ నా ఫేవరేట్ ఫిల్మ్