- Home
- Entertainment
- Karthika Deepam: హిమ, ప్రేమ్ ల మధ్య పందెం.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జ్వాలా.. స్వప్న ఫైర్!
Karthika Deepam: హిమ, ప్రేమ్ ల మధ్య పందెం.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జ్వాలా.. స్వప్న ఫైర్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ (Hima) నా బొమ్మ గీస్తే.. సౌర్య ఆ బొమ్మ చూస్తే పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు వాళ్ళ నానమ్మ సౌర్య బొమ్మ గీపించే దాని గురించి ఆలోచించి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు స్వప్న (Swapna) నా ఇంట్లో తన పెత్తనం ఏమిటి అని వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ తండ్రి ని అడుగుతుంది.
ఇక ఆనందరావు (Anand Rao) సౌందర్య అన్న మాటల్లో తప్పు ఏమీ లేదు.. సౌందర్య అన్న ప్రకారంగా జరగడానికి నేను కూడా సహకరిస్తాను అని ఆనందరావు స్వప్నతో అంటాడు. ఇక స్వప్న మీరందరూ కలిసి పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను అని అంటుంది. మరోవైపు జ్వాల (Jwala) సత్య కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది.
ఇక ప్రేమ్ (Prem) కి జ్వాల కి మధ్య కాఫీ షాప్ లో పెట్టుకున్న వాదన మళ్ళీ గుర్తుకు వస్తుంది. దాంతో ప్రేమ్ స్పెషల్ కాఫి పాడు చేసినందుకు డబ్బులు అడుగుతాడు. జ్వాల (Jwala) ఆ కాఫి బిల్లు తెస్తేనే నీకు డబ్బులు ఇస్తాను అని అంటుంది. మరోవైపు రవ్వ ఇడ్లి ఒంటినిండా దెబ్బలతో ఏడుస్తూ ఉంటాడు.
ఇక ఆర్టిస్ట్ గీసిన బొమ్మలు రెండు ఒకేలా అనిపిస్తాయి. దాంతో ఆ ఆర్టిస్ట్ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక వైపు హిమ, (Hima) ప్రేమ్ లు పానీపూరి పందెం వేసుకుంటారు. ఇక పానీపూరీలు ఎక్కువ తింటే ప్రేమ్ గిఫ్ట్ ఇస్తాడు అన్న సంగతి తెలుసుకొని.. జ్వాల (Jwala) పానీ పూరిలు తినడం స్టార్ట్ చేస్తుంది. ఇక ప్రేమ్ తన మూడ్ చిరాకు చేసినందుకు చిరాకు పడుతూ ఉంటాడు.
ఆ తర్వాత రవ్వ ఇడ్లీ కి జ్వరం అని తెలుసుకున్న జ్వాల (Jwala) తనతో పాటు హిమను కూడా తీసుకుని వెళుతుంది. ఇక మరోవైపు ఆనందరావు తన ఇంటికి వచ్చి.. వచ్చేసాను సౌందర్య (Soundarya) అని అంటాడు. అంతేకాకుండా తనను తన ఆలోచనలు మార్చడం ఎవరి వల్ల కాదని స్వప్న గురించి అంటాడు.
ఇక రవ్వ ఇడ్లీ ఇంటికి వెళ్లిన హిమ, (Hima) జ్వాల లు అక్కడ కార్తీక్ మోనిత ల ఫోటోలు చూసి ఒక్కసారిగా స్టన్ అవుతారు. అంతేకాకుండా రవ్వ ఇడ్లీ నే ఆనంద్ (Anand) అని గ్రహించుకుంటారు. ఇక ఈ క్రమంలో వీళ్లిద్దరు తన తమ్ముడు కు నిజం చెప్తారో లేదో చూడాలి.