హీరోయిన్లతో ఎఫైర్ ఉందని తెలిసీ హీరోలను భర్తలుగా స్వీకరించిన స్టార్స్ వైఫ్స్..
First Published Dec 10, 2020, 3:00 PM IST
చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ సర్వసాధారణమనే కామెంట్ వినిపిస్తుంటుంది. ఓ సినిమాలో కలిసినటించినప్పుడు అభిప్రాయాలు, మనసులు కలుస్తాయి. అవి శారీరక సంబంధాలకు దారితీస్తుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా స్టార్ హీరోలను భర్తలుగా స్వీకరించి గొప్ప మనసుని చాటుకున్నారు స్టార్స్ వైఫ్స్. మరి వారెవరూ, ఆ ఎఫైర్స్ గోలేంటో ఓ సారి చూద్దాం.
అమితాబ్ బచ్చన్ బాలీవుడ్లో బిగ్‌బీగా రాణించారు. నటుడిగా పనికి రావనే స్థితి నుంచి బాలీవుడ్లో ఆయనకు మించిన నటులు లేరనే స్థితికి చేరుకున్నారు. ఆయనకు అందాల నటి రేఖాతో సంబంధం ఉన్నట్టు వార్తలొచ్చాయి. పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత కూడా వచ్చాయి. అయినా ఎంతో కరేజ్‌తో ప్రేమించి పెళ్ళి చేసుకుంది జయ. అయితే పెళ్లి తర్వాత కూడా బచ్చన్‌తో ఆమె ఎఫైర్స్ పెట్టుకుందని వార్తలొచ్చాయి. దీంతో `రామ్బలరామ` సినిమా టైమ్‌లో సెట్లోనే రేఖ చెంపపై లాగిపెట్టి కొట్టింది జయ బచ్చన్. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హాకి ఆయన భార్య పూనమ్ వార్నింగ్ ఇచ్చింది. ఆయన నటుడిగా పీక్‌లో ఉన్న టైమ్‌లో రీనా రాయ్‌తో అక్రమ సంబంధాలు నడిపాడనే వార్తలు వినిపించాయి. ఇది తమ వైవాహిక జీవితంలోనే చిచ్చులు పెట్టింది. ఆ తర్వాత ఆ వివాదాలు సమసిపోయి శత్రుఘ్న సిన్హా, పూనమ్ కలిసిపోయారు.
నటుడు గోవింద్.. నీలమ్‌తో వివాహేతర సంబంధాలుపెట్టుకున్నాడని ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనకు సునితతో మ్యారేజ్ అయ్యిందనే విషయాన్ని గోవింద్..నీలమ్‌కి చెప్పలేదు. ఈ విషయంలో తెలిసి అటు నీలమ్, ఇటు సునీత.. గోవింద్‌ని ఓ ఆట ఆడుకున్నారు. దీంతో కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా చాలా డిస్ట్రర్బ్ అయ్యారు గోవింద్. తర్వాత అన్నీ సెట్ అయ్యాయి.
నటుడు రాజ్ బబ్బర్.. నదిరా బబ్బర్‌ని వివాహం చేసుకున్నారు. కానీ మరో నటి స్మిత పాటిత్తో ఆయన ఎఫైర్స్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి నదిరా విడిపోయింది. ఆ తర్వాత స్మిత చనిపోయింది. క్రమంగా వీరిద్దరు కలిశారు.
బాలీవుడ్ నటుడు, నిర్మాత, సింగర్ ఆదిత్య పంచోలీ.. తనకు జరినా వాహబ్తో వివాహం జరిగింది. కానీ ఆయన కంగనా రనౌత్‌తో ఎఫైర్స్ పెట్టుకున్నట్టు తెలిసింది. కంగనానే ఆదిత్యని లొంగతీసుకుందనే వార్తలొచ్చాయి. ఆమె నుంచి ఆదిత్యని సేవ్ చేసుకుని ఈ ఎఫైర్స్ కి ఫుల్స్టాప్ పెట్టే బాధ్యత తన భార్య జరినా తీసుకుని సెట్ చేసుకుందని టాక్.
అలనాటి అందాల నటుడు రాజ్ కపూర్ సైతం ఈ ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ లో ఇరుక్కున్నారు. ఆయనకు నర్గీస్‌తో ఎఫైర్ ఉందనే వార్త అప్పట్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. పెళ్లైన రాజ్ కపూర్.. నటి నర్గీస్‌తో లవ్ ఎఫైర్ సాగించాడు. కానీ అప్పటికే ఆయనకు క్రిష్ణా మల్హోత్రాతో మ్యారేజ్ అయ్యింది. దీంతో నర్గీస్‌తో లవ్ స్టోరీకి బ్రేకప్ పడింది. ప్రేమ కంటే వివాహబంధానికే ప్రయారిటీ ఇచ్చాడు. లవ్‌కి ఫుల్స్టాప్ పెట్టేశాడు.
బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా, బాద్షాగా షారూఖ్ ఖాన్ కూడా ఎఫైర్స్ పెట్టుకున్నట్టు వార్తలొచ్చాయి. ఆయన గౌరీఖాన్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రాతో చనువుగా ఉంటున్నట్టు, ఆమెతో ఎఫైర్స్ సాగించినట్టు బాలీవుడ్లో న్యూస్ వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసి గౌరీ కూడా రియాక్ట్ అయ్యింది. షారూఖ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆమెతో మళ్ళీ నటించకూడదని స్పష్టం చేసిందట. ఆ తర్వాత ప్రియాంకకి దూరంగా ఉన్నట్టు టాక్.
ప్రియాంక చోప్రా.. అక్షయ్ కుమార్‌ని కూడా బుక్ చేసింది. అక్షయ్‌కి ట్వింకిల్ ఖన్నాతో మ్యారేజ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కీ.. ప్రియాంకతో రొమాంటిక్ రిలేషన్ కొనసాగిస్తున్నారని బాలీవుడ్లో వార్తలు కోడై కూశాయి. దీంతో ట్వింకిల్ ఖన్నా రియాక్ట్ అయ్యింది. అటు ప్రియాంకకి, ఇటు భర్త అక్షయ్‌కి వార్నింగ్ ఇచ్చింది. ఇంకా ఎప్పుడు కలిసి నటించవద్దని తెలిపింది.
అజయ్ దేవగన్.. కంగనా రనౌత్‌తో కలిసి `వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబాయి` చిత్రంలో నటించారు. ఆ సమయంలో కంగనాతో అజయ్ ఎఫైర్స్ పెట్టుకున్నారని, రొమాంటిక్ రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఇది తన వరకు రావడంతో అజయ్ భార్య , నటి కాజోల్.. అజయ్‌కి సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చిందట. ఆ తర్వాత కంగనాతో ఇంకా ఎప్పుడూ నటించలేదు అజయ్.
వివాహ యేతర సంబంధాల్లో విషాదం నెలకొంటుంది. విషయం తెలిసి భార్య ఆత్మహత్యలకు పాల్పడటం,హత్యలకు పాల్పడటం, లేదా విడాకులు తీసుకోవడం జరుగుతుంటుంది. కానీ వీరు మాత్రం దాన్ని చాలా తెలివిగా మ్యానేజ్ చేశారు. తమ మ్యారేజ్ లైఫ్‌ని నిలబెట్టుకున్నారు.
Today's Poll
Please select an option to vote
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?