అప్పుడందరు ఎగతాళి చేశారు..ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తి దొరికాదుః అమలాపాల్
`ఏ.ఎల్ విజయ్‌తో విడిపోవాలనుకున్నప్పుడు నన్ను అందరు భయపెట్టారు. చాలా మంది ఎగతాళి చేశారు. నాకు సపోర్ట్ చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు` అని ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ అమలాపాల్. తెలుగులో `ఇద్దరమ్మాయిలతో` చిత్రంలో మెరిసిన అమలాపాల్ తమిళంపై ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా తాను ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పింది అమలాపాల్.
16

ఈ అమ్మడు దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌ని ప్రేమించి 2014 పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలతో 2017 విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పుడు చోటు చేసుకున్న సంఘటనల గురించి అమలాపాల్ తాజాగా పంచుకుంది.
Amala paul
26
ఇటీవల ఆమె నెట్‌ఫ్లిక్స్ చిత్రం `పిట్టకథలు`లో నటించింది. ఇందులో ఆమె మీరా అనే అమ్మాయిగా, వివాహం మీద సాంప్రదాయ ఆలోచన కలిగిన మోడ్రన్ అమ్మాయిగా కనిపించారు. భర్త చేత అవమానాలు, వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిగా మెప్పించింది. అయినప్పటికీ అతనితోనే బంధాన్ని కొనసాగిస్తుంది. గృహ హింస నుంచి ఎలా బయటపడిందనే కథాంశంతో రూపొందిన తన సెగ్మెంట్ `పిట్టకథలు` మంచి ఆదరణ పొందుతుంది.
amala paul
36
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది అమలాపాల్. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో నెలకొన్న విభేదాల కారణంగా విడిపోవాలని అనుకొన్నప్పుడు తనని అందరూ భయపెట్టారని చెప్పింది.
amala paul
46
`నువ్వు ఒక అమ్మయి`వంటూ ఎగతాళి చేశారని, తనకు అండగా ఎవరూ లేరని, తన కెరీర్ నాశనం అవుతుందని, సమాజం హేళన చేస్తుంద`ని హెచ్చరించినట్టు అమలా చెప్పారు. తన సంతోషం గురించి, తన మానసిక సంఘర్ణణను గురించి ఎవరూ పట్టించుకోలేదని అమలాపాల్ చెప్పుకొచ్చారు.
Amala paul
56
ఇదిలా ఉంటే ప్రస్తుతం తాను మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పింది. అతనెవరనేది వెల్లడించలేదు. మొత్తానికి అమలా ప్రేమలో ఉన్నట్టు స్పష్టమైంది.
Amala paul
66
ప్రస్తుతం `అధో ఆంధా పరవాయి పోలా`, `ఆడు జీవితం`, `పరాణ్ణు`, `కాడవెర్` చిత్రంలో నటిస్తుంది అమల.
Amala Paul
Latest Videos