కరోనా బ్రేక్ : బన్నీ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్

First Published 26, Mar 2020, 12:31 PM IST

రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంతో అదే మ్యాజిక్ చేసాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రానికి అంతా సిద్దం చేసుకుని షూటింగ్ కు దిగే లోగా కరోనా బ్రేక్ వచ్చింది. అయితే ఈ బ్రేక్ ని కూడా తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే విధంగా మలుచుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.
 
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బన్ని... ఈ కరోనా బ్రేక్ లో తన ప్రస్తుత చిత్రంలో క్యారక్టర్ కు ఉన్న చిత్తూరు యాస ట్రైనింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఓ ట్రైనర్ ని పెట్టుకుని మరీ అల్లు అర్జున్ ..డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇంట్లో కూడా అదే యాసని మాట్లాడుతున్నాడట. సినిమా కోసం అని కాకపోయినా ఓ కొత్త యాసను నేర్చుకోవటం చాలా ఇంట్రస్ట్ గా ఉందని అంటున్నాడట.

సినిమాలో తన నటన సహజంగా ఉండాలంటే... ఆ ఏరియాకు తగ్గట్టుగా స్లాంగ్ ఉండాలని నిర్ణయించుకున్న బన్నీ... చిత్తూరు స్లాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ను నియమించుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఓ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త యాస నేర్చుకోవడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. గతంలో రుద్రమదేవి సినిమా కోసం అచ్చ తెలంగాణ యాసను కొద్ది రోజుల పాటు ప్రాక్టీస్ చేశాడు స్టయిలిష్ స్టార్.

ఇక డీజే మూవీ కోసం బ్రహ్మణులు మాట్లాడే విధంగా మాట్లాడేందుకు నెల రోజులకు పైనే ట్యూటర్‌ పెట్టుకుని క్లాసులు తీసుకున్నాడు అల్లు అర్జున్.

ఇలా గతంలో క్యారెక్టర్ కోసం పలు యాసలు నేర్చుకున్న బన్నీ... చిత్తూరు యాసను తనదైన స్టయిల్లో ఎలా పలకబోతున్నాడన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ప్రతీ కొత్త సినిమాకు కొత్త లుక్ మెయింటేన్ చేయడంలో అందరి కంటే ముందుంటాడు అల్లు అర్జున్. డిజే, నా పేరు సూర్య, అల వైకుంఠపురములో ఇలా ప్రతీ సినిమాలోనూ కొత్తగా కనిపించాడు బన్నీ. ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం మరోసారి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు బన్నీ

ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయి అల్లు అర్జున్ లేకుండానే మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇక పరిస్దితులు అనుకూలిస్తే..వచ్చే నెలలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో బన్నీ కూడా పాల్గొననున్నాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తమిళ నటుడు విజయ సేతుపతి విలన్ గా నటించనున్నాడని సమాచారం . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఎర్రచందనం, స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎక్కువ భాగం శేషాచలం అడువుల్లోనే తీయనున్నారట.

అయితే ఈచిత్రానికి సంబంధించి శేషాచలం అనే టైటిల్ ఓకే చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతొంది. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపడేసింది. ఈ మూవీకి ఎటువంటి టైటిల్ ఖరారు చెయ్యలేదని చెప్పుకొచ్చింది.

loader