లీక్: బ‌న్నీ-సుక్కూ చిత్రం టైటిల్, రెండ‌క్ష‌రాలతో రచ్చ

First Published 3, Apr 2020, 12:37 PM

అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సూపర్ హిట్ అవటంతో ఉషారుగా 2020లో ప్రవేశించాడు బన్నీ. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 12 రిలీజ్ అయి..బన్నీ కెరీర్ కు భారీగా మైలేజీ తెచ్చిపెట్టింది. మంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ బన్నీ తదుపరి సినిమాపై పడటం అత్యంత సహజం. ఇప్పటికే బన్ని కూడా ఆ సినిమాని లైన్ లో పెట్టేసాడు. తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ ని సీన్ లోకి తెచ్చాడు.

ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయి అల్లు అర్జున్ లేకుండానే మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.

ఇక వచ్చే నెలలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో బన్నీ కూడా పాల్గొననున్నాడు అనుకునే టైమ్ లో లాక్ డౌన్ తో దెబ్బ పడింది. ఈ సినిమా కోసం బ‌న్నీ త‌న వేషం, భాష మార్చుకున్నారు. గుబురు గ‌డ్డం, ఒత్తైన జుత్తుతో ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నాడు.

అసలు విషయానికి వస్తే ఈ సినిమానికి సింహాచలం, శేషాచలం అనే టైటిల్స్ పెట్టబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వెంటనే చిత్రం టీమ్ వాటిని ఖండించేసింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కు టైటిల్ ఫైనలైజ్ అయ్యిపోయింది.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన `ఆర్య‌`, `ఆర్య 2` మాదిరిగానే ఈ సినిమాకు రెండు అక్షరాల టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అలాగే ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉంటుందని, ఓ అమ్మాయి పేరుని గుర్తు చేసేలా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే టైటిల్ లోగో కూడా రెడీ అయ్యిపోయిందని వార్త.

ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ టైటిల్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది ఆ రెండ‌క్ష‌రాల టైటిల్ ఏమిటో అని గెస్  చేయటం మొదలెట్టారు. రకరకాల టైటిల్స్ వినపడుతున్నాయి. కానీ అసలు సుకుమార్ ఏమనుకున్నాడో తెలియాలంటే  కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఎర్రచందనం, స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎక్కువ భాగం శేషాచలం అడువుల్లోనే తీయనున్నారట.

అల్లు అర్జున్ కి ఇది 20వ సినిమా కాగా సుకుమార్ తో మూడో సినిమా.. ఆర్య, ఆర్య 2 లాంటి మంచి హిట్ల తరవాత వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

‘అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. టైటిల్‌, ఇతరాత్రా అంశాలపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. టైటిల్‌ ఫిక్సవ్వగానే అధికారికంగా ప్రకటిస్తాం. టైటిల్‌ ఖరారయ్యేవరకు వర్కింట్‌ టైటిల్‌ ‘ఏఏ20’ నే కొనసాగిస్తాం’ అంటూ చిత్ర టీమ్ గతంలో ఓ ట్వీట్‌ చేసింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తమిళ నటుడు విజయ సేతుపతి విలన్ గా నటించనున్నాడని సమాచారం . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

loader